గత కొంతకాలం నుండి టాలీవుడ్ లో బయోపిక్స్ మీద దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి సినిమా విజయం సాధించటంతో బయోపిక్ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత ఎన్టీయార్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కించటం జరిగింది. కానీ ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అనిపించుకుంది. 
 
వై యస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో వచ్చిన బయోపిక్ యాత్ర కూడా మంచి విజయాన్ని అందుకుంది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్ పేరుతో లక్ష్మీ పార్వతి జీవిత చరిత్రను తెరకెక్కించాడు. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమా రంగంలోకి స్వయంకృషితో వచ్చాడు. ఎన్నో కష్టాలు పడి సినిమా రంగంలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు. 
 
రేపు విడుదల కాబోతున్న వాల్మీకి సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో హీరో వరుణ్ తేజ్ కు చిరంజీవి బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు వరుణ్ బదులిస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవి బయోపిక్ తీస్తానని చెప్పాడు. చిరంజీవి బయోపిక్ లో నాకంటే అన్నయ్య రామ్ చరణ్ నటిస్తే బాగుంటుంది. ఒకవేళ రామ్ చరణ్ నటించకపోతే మాత్రం నేను తప్పకుండా నటిస్తాను. 
 
చిరంజీవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోను అని వరుణ్ తేజ్ చెప్పాడు. చిరంజీవి బయోపిక్ వస్తే చిరంజీవి సినిమా జీవితం, రాజకీయ జీవితం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీయార్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకులు అభిమానించే వ్యక్తి చిరంజీవి. మరి చిరంజీవి బయోపిక్ లో ఎవరు నటిస్తారో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: