ఇటీవ‌ల కాలంలో ఏ ఇండ‌స్ట్రీ అయినా హీరోయిన్ల‌కు కొర‌త లేదు. చాలా మంది ఉంటారు. వాళ్లంద‌రిలోనూ న‌య‌న‌తార‌ది చాలా భిన్నం. ఏ వుడ్‌ల‌లో అయినా ఆమె ఓ సినిమాకు సైన్ చేస్తుందంటే దానికి చాలా కండీష‌న్లు పెడుతుంద‌ట‌. నా పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉండాలి... నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి.... భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. సినిమాలో నేను యాక్ట్ చేయ‌డ‌మే త‌ప్పించి ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం రాన‌న్న కండీష‌న్లు పెట్టేస్తుంటుది.


ఇలా ఎన్ని కండీష‌న్లు పెట్టినా ఆమె అడిగినంత ఇచ్చి మ‌రీ ఆమెనే త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేసుకుంటూ ఉంటారు. వరుస విజయాలతో దూసుకెళుతూ.. చేతి నిండా ప్రిస్టేజియస్ ప్రాజెక్టుల్లో చేస్తున్న నయన్ తెలుగులో చేసిన సైరా విడుదలకు సిద్ధమవుతుండగా.. తమిళంలో నెట్రిక్కన్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.  తాజాగా నయన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.


ఇప్ప‌టికే ఆమెకు కండీస‌న్ల క్వీన్ అన్న ట్యాగ్‌లైన్ త‌గిలించేశారు. ఇక ప్ర‌స్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల రెమ్యునరేష‌న్ తీసుకుంటోంద‌ట‌. ఇండ‌స్ట్రీలో రోజు రోజుకు త‌న రేంజ్ పెంచుకుంటూ హీరోల రెమ్యున‌రేష‌న్‌ను బీట్ చేసే రేంజ్‌కు ఎదిగిపోయింది. ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్నా... ఆమె పెట్టే కండీష‌న్లు మాత్రం మామూలుగా ఉండ‌డం లేదు. ముఖ్యంగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఆమె ప్ర‌మోష‌న్ల‌కు మాత్రం డుమ్మా కొట్టేస్తోంది. సైరా లాంటి సినిమాల‌నే ఆమె లైట్ తీస్కొంటోంది.


ఇండస్ట్రీని హీరోలే రాజ్యమేలాలా? అన్న ప్రశ్నకు నయనతార లాంటోళ్లు సమాధానమవుతారని చెప్పక తప్పదు. ఏమైనా.. హీరోలతో పోటీ పడేలా రెమ్యునరేషన్ పెంచే నయన గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. ఇక న‌య‌న‌తారతో న‌టించేందుకు సౌత్‌లో ఉన్న అగ్ర హీరోల‌తో పాటు మీడియం రేంజ్ హీరోలు సైతం ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఆమె చెపుతోన్న రేటు చుక్క‌ల్లో ఉండ‌డంతోనే చాలా మంది వెన‌క‌డ‌గు వేస్తుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: