దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగులో మొట్టమొదటి సారి పోరాడిన యోధుడిగా పేరొందిన వాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు ప్రాంతానికి చెందిన ఈయన జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సైరా సినిమా తెరకెక్కించడం జరిగింది. సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు చిరంజీవి సినిమా కోసం కష్ట పడటం జరిగింది. అయినా కానీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా నత్తనడకన సాగుతున్న తరుణంలో సోషల్ మీడియాలో అభిమానులు సినిమా యూనిట్ పై విమర్శలు కూడా చేయడం మొదలుపెట్టారు.


ముఖ్యంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక ముందుగా కర్నూలు ప్రాంతంలో చేయాలని భావించిన సినిమా ఇది అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండా వాయిదా వేయడం జరిగింది. దానికి కారణం వాతావరణం. అందువల్లనే ఈ ప్రి రిలీజ్ వేడుక ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక కర్నూల్ ప్రాంతం నుండి హైదరాబాద్ మార్చాలని ముందుగా చెప్పింది చిరంజీవి అని ఫిలింనగర్ లో టాక్.


దీంతో  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమని అభిమానులు సంతోషంగా ఉన్నారు. అక్టోబర్ 2 న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మరి అలాగే కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా తమన్నా ఓ కీలక పాత్రలో నటించినట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీకి అమితాబచ్చన్ మరి ఇతర నటులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నటించిన ఈ సినిమాపై మెగా అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: