సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్కళలకి వయసుతో సంబంధం లేదు..కళ నేర్చుకోవాలనే సంకల్పం ఉండాలి అంతే ..ఒక పదకొండేళ్ల కుర్రాడు యావత్ ప్రపంచాన్నే తన గాత్రం తో తన వైపు చూసేలా చేసుకున్నాడంటే అతనికి సంగీతం పట్ల ఉన్న  మక్కువ..నేర్చుకోవాలనే తపన ఎంతలా ఉందో ఒక్క సారి ఆలోచించండి..తన భక్తి గీతాలతో  ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ కుర్రాడు..ఈ తరం పిల్లలకు ఎంతో ఆదర్శం గా నిలుస్తున్నాడు.

“రాహుల్ వెల్లాల్” కర్ణాటక కు చెందిన ఈ పదకొండేళ్ల కుర్రాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో సరికొత్త అధ్యయాలను లిఖిస్తున్నాడు..చాలా చిన్న వయసులోనే..!!రెండున్నరేళ్ల వయసులోనే తను విన్న పాటను రాహుల్ చక్కగా పాడేందుకు ప్రయత్నించేవాడు. దీంతో సంగీతం నేర్పించడం కోసం ప్రయత్నించారు. కానీ పసివాడు కావడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో వారే తమ కొడుక్కి శ్లోకాలు నేర్పారు. అతడికి నాలుగేళ్లొచ్చాక సుచేత రంగస్వామి ఆ పిల్లాడికి శాస్త్రీయ సంగీతం నేర్పడం ప్రారంభించారుమూడేన్నరేళ్ల శిక్షణ తర్వాత సుప్రసిద్ధ సంగీత ఉపాధ్యాయురాలు శ్రీమతి కళావతి అవధూత్  గారి దగ్గర శిక్షణ పొందుతున్నాడు. కులూరు జయచంద్ర రావు దగ్గర మృదంగం వాయించడం, అభిషేక్ ఎస్.ఎన్. దగ్గర వెస్ట్రన్ క్లాసిలకల్ పియానో వాయించడం నేర్చుకుంటున్నాడు. రోజూ రెండు గంటలపాటు పాటలు పాడటం రాహుల్‌కి అలవాటు.పొరుగుదేశాలలో కూడా ప్రదర్శనలు..!రాహుల్ ఇప్పటికే సింగపూర్, లావోస్, అబుదాబి, ముంబై, పుణే, చెన్నై తదితర చోట్ల ప్రదర్శనలు ఇచ్చాడు.

కేరళలోని గురువాయూర్ ఆలయంలో జూలై 28న ప్రదర్శన ఇవ్వడానికి కూడా అతడికి ఆహ్వానం అందింది.సామాజిక మాధ్యమాలలో సంచలనాలు..!!రాహుల్ 11 ఏళ్లకే యూట్యూబ్ సంచలనంగా మారాడు. అతడి యూట్యూబ్  పేజీకి ఇప్పటికే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. సూర్య గాయత్రి అనే చిన్నారి గాయనితో కలిసి అతడు ఆలపించిన “బ్రహ్మమొక్కటే” అనే తెలుగు పాటకే 66 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం, శ్రీ శ్రీ రవిశంకర్ తదితర ప్రముఖులు రాహుల్ గాత్రానికి అభిమానులు  అయిపోయారు. రాహుల్ పాటల్లోనే కాదు చదువులోనూ ముందున్నాడు.చెన్నైకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కుల్దీప్ ఎం పై కోసం రాహుల్ ఏడు పాటలు పాడాడు. అవన్నీ యూట్యూబ్‌లో సెన్షేషన్‌గా మారాయి. దేశ విదేశాల్లో నిర్వహించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రదర్శనల్లో రాహుల్ పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నాడు.తల్లి తండ్రుల ప్రోత్సాహం తోనే…!!ఇంత చిన్న వయసులోనే ఇంతటి గొప్ప స్థాయికి చేరుకున్నాడంటే దీనికి ప్రధాన కారణం రాహుల్ తల్లి తండ్రులు. రాహుల్ తల్లి తండ్రులు బెంగుళూరులో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.

తన లోని ప్రతిభ ను చిన్న వయసులోనే గుర్తించి ఆ ప్రతిభకు కావాల్సిన మెరుగులు దిద్దించారు..ఎన్నో అవార్డులు మరియు రివార్డులు..!!చిన్నవయసులోనే ఎన్నో ప్రతిభా పురస్కారాలు & ఎంతో మంది గొప్ప వారి ఆశీస్సులు అందుకున్న ఈ చిన్నారి రాహుల్ వెల్లాల్. భవిష్యత్తులో మరింత గొప్ప స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..ప్రతిభ ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంటుంది..ఆ ప్రతిభకు ను బయటకు తీసి..ఆ ప్రతిభకు కావాల్సిన మెరుగులు దిద్దిఆ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తే..మనం అనుకున్న లక్ష్యాలను మరియు అనుకోని గౌరవ ప్రతిష్టలను పొందగలం..రాహుల్ వెల్లాల్..నీవు కలకాలం ఇలా నీ ప్రతిభ తో పదిమందికి వెలుగులు పంచుతూ ముందుకు సాగిపోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: