నిన్న విడుదలైన ‘సైరా’ ట్రైలర్ కు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన స్పందన కొనసాగుతోంది. అయితే ఈ మూవీ ఆసిస్తున్న రికార్డులు సృష్టించాలి అంటే ఈ మూవీ బాలీవుడ్ లో ఘన విజయం సాధించి తీరాలి. అప్పుడే ఈ మూవీ ‘బాహుబలి’ స్థాయిలో ఘనవిజయం సాధించ గలుగుతుంది.

సుమారు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మూవీ బయ్యర్లు గట్టెక్కగలుగుతారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించి తీరాలి. 

దీనితో ‘సైరా’ ట్రైలర్ కు బాలీవుడ్ నుండి స్పందన ఎలా ఉంది అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ ట్రైలర్ పై బాలీవుడ్ మీడియాలోని కొన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ‘చిరంజీవి సర్ బాలీవుడ్ కు స్వాగతం’ అంటూ కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. మరికొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు అయితే చారిత్రాత్మక సినిమాలను ఎలా తీయాలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి నేర్చుకోవాలి అంటూ ప్రశంసిస్తున్నాయి. 

అయితే ఈ ట్రైలర్ పై ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ ఫిలిం సెలెబ్రెటీలు కానీ అదేవిధంగా బాలీవుడ్ టాప్ ఫిలిం క్రిటిక్స్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే గతంలో ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలైనప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఆమూవీ బాలీవుడ్ వెర్షన్ ను ప్రమోట్ చేసింది కరణ్ జోహార్ లాంటి ప్రముఖ వ్యక్తి. దీనితో ‘సైరా’ పట్ల బాలీవుడ్ అంత ఆశక్తి కనపరచడం లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇదే పరిస్థితి బాలీవుడ్ ప్రేక్షకుల స్పందనలో ఉంటే రికార్డులు క్రియేట్ చేసే విషయంలో ‘సైరా’ కు జాతీయ స్థాయిలో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అన్న సందేహాలు కలుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: