మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించడం జరిగింది. మంచి మాస్ మాస్ మరియు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల సెన్సార్ జరుపుకున్న ఈ సినిమా టాక్ నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే వారు చెప్తున్న టాక్ ని బట్టి, మొత్తం 168 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

రన్ టైం పరంగా చూస్తే కాస్త ఎక్కువ నిడిగివి గల సినిమా అయినప్పటికీ, దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు చెప్తున్నారు. గణేష్ అనే ఒక సాధారణ వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వలన గద్దలకొండ గణేష్ అనే ఒక పక్కా గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలోని మూల కథాంశమట. ఇక మధ్యలో గణేష్ లవ్ స్టోరీ, అలానే తాను తీయబోయే సినిమా కోసం ఒక గ్యాంగ్ స్టర్ ని వెతికే డైరెక్టర్ పాత్రలో నటించిన అథర్వ మురళి, నిజమైన గ్యాంగ్ స్టర్ అయిన గణేష్ ని తన సినిమా కోసం తీసుకోవడం వంటి అంశాలు సినిమాలో ఎంతో బాగుంటాయట. ఇక ఫస్ట్ టైం పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న వరుణ్ తేజ్, గద్దలకొండ గణేష్ పాత్రలో ఇరగదీసినట్లు సమాచారం. 

వెల్లువొచ్చి గోదారమ్మ, జర్ర జర్ర సాంగ్స్ సినిమాకు పెద్ద హైలైట్ అని, ఇక సినిమాలోని కీలక యాక్షన్ మరియి ఛేజింగ్ సీన్స్ అయితే మరింతగా బాగుంటాయని అంటున్నారు. సంగీతంతో పాటు మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరహో అనే రేంజ్ లో ఉండనుందట. ఇక సినిమాలోని విజువల్స్ ని ఎంతో గ్రాండియర్ గా చూపించిన ఫోటోగ్రాఫర్ ఆయనంక బోస్ పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. మొత్తంగా ఈ వాల్మీకి సినిమా మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయడం ఖాయమని, అయితే మాస్ సినిమా అవడంతో కేవలం బి మరియు సి సెంటర్స్ లోనే ఆడే అవకాశం ఉందనే టాక్ ప్రచారం అవుతుండడంతో, అటువంటిది ఏమీ లేదని, ఫ్యామిలీ మరియు క్లాస్ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు. మరి సెన్సార్ వారికి ఎంతగానో నచ్చిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో వేచి చూద్దాం.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: