తనో లేడీ సూపర్ స్టార్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎలాంటి వైవిధ్యమైన పాత్ర అయినా ఇట్టే నటించి మెప్పించగల  సామర్థ్యం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార. తెలుగు తమిళ భాషల్లో నయన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె చేసే పాత్రలన్నీ నయన్ తప్ప ఇంకెవరు చేయలేరు ఏమో అనేంతగా  తన నటనతో ప్రభావితం చేస్తుంది.

 

 

కాగా  ప్రస్తుతం  చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ భామ. ఓ వైపు సీనియర్ హీరోలతో... మరోవైపు కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతుంది నయనతార. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అయితే నయనతార కేరాఫ్ అడ్రస్ గా మారింది.అయితే నయనతార ప్రస్తుతం చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో... సూపర్ స్టార్ రజనీ సరసన దర్బార్ సినిమాలో... విజయ్ కి సరసన బిజిల్  ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఇప్పటివరకు తన పారితోషికాన్ని నాలుగు కోట్లు మాత్రమే తీసుకున్న ఈ భామ ... ఒక్కసారిగా తన నెక్స్ట్ సినిమాకి 6 కోట్లు డిమాండ్ చేసిందట.. కాగా నయనతార  ఒక్కసారిగా పారితోషికాన్ని భారీగా పెంచడంతో... దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట .అయితే  ఎంత పారితోషికం తీసుకున్న సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనని ముందే అగ్రిమెంట్ చేసుకుంటుంది నయన్ . అందుకే ఏ సినిమా ప్రమోషన్స్ లో కూడా నయనతార కనిపించదు. కానీ ఈ మధ్య నయనతార తన పంతాని  మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ  సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని నయనతార... ఇప్పుడు సైరా సినిమా కోసం ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ఒప్పుకుందట. అంతేకాదు విజయ్ కి జోడిగా నటిస్తున్న బిజిల్  సినిమా  ప్రమోషన్స్ లో  కూడా   నయన్ పాల్గొనబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: