సూర్య, సినిమాటోగ్రఫీ సూర్య, సినిమాటోగ్రఫీ మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్
భారత ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) నిజాయితీగల రాజకీయ నాయకుడు. ప్రధానికి ప్రాణహాని ఉందని తెలుసుకుని రవి కిశోర్ (సూర్య) ప్రధానికి పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ గా నియమించబడతాడు. సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ప్రధానికి దగ్గర అవుతాడు. ఓ బాంబ్ బ్లాస్ట్ లో చంద్రకాంత్ వర్మని చంపేస్తారు. ఇంతకీ చంద్రకాంత్ వర్మని చంపింది ఎవరు..? ఆ టైంలో రవి కిశోర్ ఏం చేశాడు..? నిందుతులను పట్టుకున్నాడా లేదా అన్నది సినిమా కథ.  



రవి కిశోర్ పాత్రలో సూర్య నటన ఆకట్టుకుంది. సెక్యురిటీ ఆఫీసర్ గా సూర్య అదరగొట్టాడు. సయేషా సైగల్ కూడా తన నటనతో మెప్పించింది. ఆర్య కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. మోహన్ లాల్ ఎప్పటిలానే తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. బొమన్ ఇరాని నటన బగుంది. సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.



ఎం.ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు ఆయన కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. హారీస్ జైరాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ లో బిజిఎం హైలెట్ గా నిలిచింది. దర్శకుడు కె.వి. ఆనంద్ కథ, కథనాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.



దేశ ప్రధానికి రక్షకుడిగా ఉన్న హీరో అతన్ని కాపాడటంలో విఫలమవడంతో పాటుగా ప్రధాని మరణానికి కారణమైన వారిని ఎలా పట్టుకున్నాడు అన్నది బందోబస్త్ కథ. ఈ సినిమా థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించాడు. అయితే కొన్ని సీన్స్ మినహా మిగతా సినిమా అంత థ్రిల్లింగ్ గా అనిపించదు.


ఫస్ట్ హాఫ్ అంతా పర్ఫెక్ట్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. సినిమా కథ బాగా రాసుకున్నా కథనం పెద్దగా మెప్పించలేదని చెప్పొచ్చు. మొదలుపెట్టడం చాలా ఇంటెన్స్ గా మొదలు పెట్టగా రాను రాను అది తగ్గిపోతుంది. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను పర్ఫెక్ట్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు.    


ఇక సినిమాలో ఎంటర్టైనింగ్ కు అసలు ఛాన్స్ లేకుండా చేశాడు. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన సస్పెన్స్ ఉన్నా దాన్ని సినిమా మొత్తం కొనసాగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అసలకే తెలుగులో తమిళ హీరోల పరిస్థితి బాగాలేదు. ఇక బందోబస్త్ కూడా సూర్యకు మరోసారి నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు.



సూర్య,మోమన్ లాల్, ఆర్య.కెవి ఆనంద్సూర్య 'బందోబస్త్'.. ఫలించని ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: