ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  నిన్న బాలీవుడ్ ప్రముఖ దర్శకులు శ్యామ్ రామ్‌సే కన్నుమూశారు. టాలీవుడ్, బాలీవుడ్ లో కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  హాలీవుడ్ లో ఫోర్న్ సినిమాల ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి హఠాన్మరణం అందరిని షాక్ కి గురి చేసింది. ఇప్పటి వరకు ఎన్నో అడల్ట్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి జెస్సికా  రూమ్ లోనే విఘత జీవిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  అయితే ఆమెది సహజమరణమా..?లేదా ఎవరైనా హత్య చేశారా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.  గత కొన్నాళ్లుగా జెస్సికా జేమ్స్ పోర్న్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు.  అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆమె స్నేహితుడు శాన్ పెర్నాండో కొన్ని గంటలుగా జెస్సికాను కాంటాక్ట్ చేయాలని ప్రయత్నం ఆమె నుంచి స్పందన రాలేదు.


ఎంత సేపటికీ జెస్సికా నుంచి సమాధానం రాకపోవడంతో శాన్ పెర్నాండో ఆమె ఇంటికి వెళ్లి చూశాడు..అక్కడ జెస్సికా స్పృహలో లేకుండా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు జెస్సికా ఇంటికి రావడం..ఆమెను పరీక్షించడం జరిగిందట..అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

జెస్సికా చాలా రోజులుగా మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మరణానికి గల కారణాలు తెలియజేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె మరణ వార్త విన్న హాలీవుడ్ నటీ,నటులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: