గత కొంత కాలంగా తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా సినిమా విజయానికి హీరోల గెస్ట్ అపీరియన్స్, ప్రమోషన్స్ లో అపీరియన్స్ కంటిన్యూ అవుతున్నాయి. స్టార్ హీరోలు మల్టీస్టారర్లకు అంగీకరిస్తున్నారు. అలాగే మన యువహీరోలు అతిధి పాత్రల్లో కనిపిస్తూ సినిమాకి క్రేజు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు కొందరు యంగ్ హీరోలు స్నేహం కోసం సాయానికి ముందుకొస్తుండడం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విషయం.

హీరో నితిన్ స్నేహం కోసం అఖిల్ డెబ్యూ సినిమాకి నిర్మాతగా మారాడు. అలాగే తనతో సింక్ అయ్యి నటించే నటులకు రిపీటెడ్ గా అవకాశాలిస్తుంటాడు. అంతేకాదు తాజాగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమాలో సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు కూడా. ఈ సినిమాలో నితిన్ ఓ అతిధి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ తెలపడంతో అందరికి ఆతృత బాగా పెరిగిపోయింది. 'వాల్మీకి' లో అతిథి పాత్రలో కనిపించిన మా 'భీష్మ'కు ధన్యవాదాలు. లవ్ యూ డార్లింగ్ అని ట్వీట్ చేస్తూ నితిన్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. వాల్మీకి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. సెప్టెంబరు 20న గత్తర్ లేపాలె.. ఆల్ ది బెస్ట్ అని తిరిగి రీ ట్వీట్ చేశారు నితిన్. అయితే ఇంతకీ నితిన్ చేస్తున్న పాత్ర ఏది? అన్న సందేహం చాలామందికి వస్తుంది. కానీ అది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. 

ఒక గ్యాంగ్ స్టర్ జీవితంలోని పరిణామాలతో తీసిన సినిమా వాల్మీకి. వరుణ్ తేజ్ - హరీష్ జోడీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో వరుణ్ లుక్ ఆహార్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ శుక్రవారం 20న సినిమా రిలీజవుతోంది. ఇక వరుణ్-నితిన్ ఒకే ఫ్రేం లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. నిజంగా ఇది వర్కౌట్ అయితే మాత్రం పక్కా ఈ ఇద్దరు యంగ్ హీరోస్ కలిసి మల్టీ స్టారర్ చేసే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరి హీరోలకి సొంత నిర్మాణ సంస్థలున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి  నాగబాబు సినిమాలు నిర్మించకుండా సీరియల్స్, టీవి షోస్ తో బిజీగా ఉన్నారు. ఒకవేళ వరుణ్-నితిన్ సినిమా ప్రతిపాదన వస్తే మాత్రం పక్కా ప్లాన్ చేసే అవకాశాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: