మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు ముందు వాల్మీకి అని టైటిల్ అనుకున్నా చివరి నిమిషంలో టైటిల్ ను గద్దలకొండ గణేష్ అని మార్చినట్టు తెలుస్తుంది. సినిమాలో వరుణ్ తేహ్ పాత్ర పేరు గద్దలకొండ గణేష్ ఆ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టి సినిమాను రిలీజ్ చేస్తున్నారు.


అయితే ఈ టైటిల్ పెట్టడానికి మరో కారణం సినిమా టీజర్, ట్రైలర్ లో వరుణ్ పాత్ర ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. అందుకే క్యాచీగా ఉండేందుకు వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మార్చారు. రేపు రిలీజ్ అనగా సినిమా టైటిల్ మార్చడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. టైటిల్ మార్చుతున్నట్టు ప్రకటించిన దర్శకుడు హరీష్ శంకర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.  


ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా తెరకెక్కించారు. తమిళ సినిమాలో సిద్ధార్థ్ పాత్రని కోలీవుడ్ హీరో అధర్వ పోశించారు. మాత్రుకలో బాబీ సింహా చేసిన రోల్ ను వరుణ్ తేజ్ నటించారు. అయితే హరీష్ శంకర్ సినిమాలో పూర్తిగా వరుణ్ తేజ్ పాత్ర మీదనే దృష్టి పెట్టి అధర్వకు అన్యాయం చేశారన్న టాక్ వస్తుంది.   


సినిమాలో అధర్వ ఓ క్రియేటివ్ డైరక్టర్ రోల్ చేశాడు. ఒరిజినల్ వర్షన్ లో కూడా సిద్ధార్థ్ కన్నా బాబీ సిం హా పాత్ర మీదనే అందరి దృష్టి ఉంటుంది. అలానే మెగా హీరో వరుణ్ తేజ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు హరీష్ శంకర్. ప్రచార చిత్రాలన్ని వరుణ్ తేజ్ ను హైలెట్ చేస్తూ వచ్చేసరికి ఈ గద్దలకొండ గణేష్ సినిమాలో తమిళ నటుడికి అన్యాయం చేశారన్న టాక్ ఉంది. మరి సినిమా చూశాక ఆ నిర్ణయం మార్చుకుంటారేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: