మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకులు ఉండరేమో. దక్షిణాదిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చిరంజీవి ఉత్తరాదిలోనూ తన సత్తా చాటారు. కేవలం మూడు హిందీ సినిమాల్లో మాత్రమే నటించినా తన డ్యాన్సులతో హిందీ ప్రేక్షకులను అలరించి, బాలీవుడ్ నటులను ఆశ్చర్యపోయేలా చేశాడు. పాతికేళ్ల తర్వాత సైరా.. తో హిందీకి వెళ్తున్నా అక్కడి ప్రేక్షకులు, బాలీవుడ్ హీరోలు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడం విశేషం.

 

 

సైరా టీజర్ ఆసక్తి రేకెత్తిస్తే.. ఇటివల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేసింది. టాలీవుడ్, బాలీవుడ్ లో అనేక మంది సెలబ్రిటీలు సైరా.. గురించి ట్వీట్లు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్స్.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సైరా ట్రైలర్ ను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వీరిద్దరికీ చిరంజీవి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అమీర్.. తాను చిరంజీవి అభిమాని అని చెప్పుకుంటాడు. సల్మాన్ కు చిరంజీవి అంటే గౌరవం, చరణ్ తో మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరి ట్వీట్స్ తో సైరా.. కు ఉత్తరాది మొత్తానికి మంచి ప్రమోషన్ లభించిందనే చెప్పాలి. సినిమాలో నటించిన బిగ్ బీ అమితాబ్ సైతం ట్విట్టర్ లో సైరా గురించి పోస్ట్ చేశారు. టాలీవుడ్ నుంచి రాజమౌళి, మహేశ్, సమంత.. ఇలా చాలా మంది సైరా.. ట్రైలర్ అద్భుతమంటూ ట్వీట్స్ చేశారు.

 

 

చిరంజీవి నట విశ్వరూపాన్ని, చరణ్ మేకింగ్ వాల్యూస్, డైరక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్.. తో టీజర్ చాలా గ్రాండ్ గా ఉంది. దీంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: