హీరోయిన్లకు గ్లామర్ తో పాటుగా మంచి డ్యాన్స్ కూడా తెలిసి ఉండాలి.  ఆలా ఉన్నప్పుడే రెండింటిలోనూ మంచి పరిణితి సాధిస్తారు.  గ్లామర్ ఉండి డ్యాన్స్ లేకున్నా.. డ్యాన్స్ ఉండి పలుకుబడి లేకున్నా జీవితం ముందుకు సాగదు.  అందుకే గ్లామర్ రంగంలో రాణించాలని తప్పనిసరిగా డ్యాన్స్, గ్లామర్ రెండు తెలిసి ఉండాలి.  


అయితే, ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో కలిసి వస్తుంది.  అలంటి వాటిల్లో ఒకటి రాజకీయ రంగం.  సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మంచి పేరు తెచ్చుతుంటే చాలు.. రాజకీయాలు ఆకర్షిస్తాయి.  రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటారు.  వెళ్ళాక రాణిస్తారా లేదా అన్నది తరువాత సంగతి సంగతి.  బెంగాల్ కు చెందిన మిమి చక్రవర్తి, నస్రత్ లకు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది.  


ఈ ఇద్దరు బెంగాల్ లో స్టార్ కాదు.  కానీ, అవకాశం వచ్చింది.  ట్రై చేద్దామని అనుకున్నారు.  అనుకున్నట్టుగా ట్రై చేశారు.  లక్ కలిసి వచ్చి ఇద్దరు ఎంపీలుగా ఎన్నికయ్యారు.  ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీలు బెంగాల్ లో దసరా వస్తున్న సందర్భంగా హంగామా చేస్తున్నారు.  దసరా కోసం ఓ ప్రత్యేకమైన సాంగ్ ను చేస్తున్నారు  


ఇటీవలే దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.  మిమి చక్రవర్తి ,నస్రత్ లు సంప్రదాయబద్ధమైన చీరల్లో మెరుపులు మెరిపించారు.  మరో నటి రూపా గంగూలీతో కలిసి ఈ సాంగ్ ను చేశారు.  అయితే, ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రెస్పాన్స్వస్తున్నది.  పార్లమెంట్ లో ఉండగా పార్లమెంటేరియన్ గా, ప్రజా కార్యక్రమాల్లో సెంటర్ ఎట్రాక్షన్ గా ఉన్నారు.  దుర్గ నవరాత్రులపై ఓ సాంగ్ ను చేశారు.  ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  లక్షలాది వ్యూస్ ను ఈ సాంగ్ సొంతం చేసుకున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: