హరీష్ శంకర్  డైరెక్షన్ లో మెగా హీరో  వరుణ్ తేజ్ నటించిన  లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. ముందుగా ఈచిత్రానికి వాల్మీకి  అనే టైటిల్ ను పెట్టగా  అది కాస్త వివాదం కావడంతో  చివరి నిమిషంలో ఆటైటిల్ మార్చి..  గద్దల కొండ గణేష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ .  ఇక అన్ని అవాంతరాలను దాటుకొని  ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రాగ..  ప్రీమియర్స్ అలాగే ఎర్లీ మార్నింగ్ షోస్ ద్వారా  వస్తున్న టాక్ ప్రకారం  సినిమా బాగుందని సమాచారం. మాస్ ఇమేజ్  తెచ్చుకోవడానికి  ఈ సినిమా వరుణ్ కు  బాగా ఉపయోగపడుతుందని   సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా  మాస్  ప్రేక్షకులను  ఈ సినిమా బాగా ఎంటర్ టైన్ చేస్తుందట.  హరీష్  మార్క్ టేకింగ్  సినిమా కు ప్రధాన బలం అంటున్నారు.  మొత్తానికి  టైటిల్ వివాదం తో మనస్థాపానికి గురైన  హరీష్ శంకర్  కు  ఈ చిత్రం యొక్క ఫలితం  జోష్ఇచ్చాలనే వుంది. 


కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'జిగర్తండా' కు  రీమేక్ గా తెరకెక్కిన  ఈచిత్రంలో  బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్ నటించగా  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ  హీరో అథర్వ మురళి నటించాడు.  కాగా  వీరికి జోడిగా ఈ సినిమాలో  పూజా హెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా  నటించారు.  14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మించిన ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

గద్దలకొండ గణేష్ కు వస్తున్న  టాక్ ప్రకారం  సినిమాలో పాజిటివ్స్ , నెగిటివ్స్ ఫై ఓ లుక్కేద్దాం.. 

బలాలు : 

వరుణ్ నటన , గెటప్ 
డైలాగ్స్ 
దర్శకత్వం 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
క్లైమ్యాక్స్ 

బలహీనతలు  : 

సెకండ్ హాఫ్ ల్యాగ్
అథర్వా పాత్ర 
సినిమాటోగ్రఫీ 




మరింత సమాచారం తెలుసుకోండి: