ఒకప్పుడు ప్రేక్షకుల్ని తన అందచందాలతో కట్టిపడేసిన భామ కరిష్మాకపూర్‌.కాగా,17 ఏళ్ల వయసులోనే కరిష్మాకపూర్ చదువుకు టాటా చెప్పి సినిమాల్లోకి వచ్చేశారు.1991లో వచ్చిన ‘ప్రేమ్ ఖైదీ’సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేశారు.ఆ తరవాత ‘పోలీస్ ఆఫీసర్’,‘జాగృతి’,‘నిశ్చయి’,‘సాప్నే సజన్ కే’,‘దీదర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు.ఆమీర్ ఖాన్‌తో కలిసి చేసిన ‘రాజా హిందుస్థానీ’చిత్రం కరిష్మాను టాప్ హీరోయిన్‌ను చేసేసింది.ఆతర్వాత షారుఖ్ ఖాన్‌తో‘దిల్ తో పాగల్ హై’,గోవిందతో ‘హీరో నం.1’,సల్మాన్ ఖాన్‌తో ‘బివి నం.1’వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈవిడ ఓ కేసులో ఇరుక్కుంది.అది కూడా ఎప్పుడో 20 ఏళ్ళక్రితం అంటే 1997 లో,బాలీవుడ్ హీరో సన్నీడియోల్, కరిష్మా కపూర్ లు బజరంగ్ సినిమా చిత్రీకరణ సమయంలో ట్రైన్ చైన్ లాగారని కేసు బుక్ చేసారు..



రాజస్థాన్ లోని అజ్మిర్ జిల్లాలోని ఫులేరా సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సన్నీ డియోల్,కరిష్మా కపూర్ లు సమీపంలో ఉన్న నరేనా రైల్వే స్టేషన్లోకి వచ్చి అప్ లింక్ ఎక్స్ ప్రెస్ చైన్ లాగారని, ఫలితంగా రైలు 25 నిముషాలు ఆలస్యం అయ్యి ప్రయాణికులు ఇబ్బంది పడడంతో స్థానిక రైల్వేస్టేషన్ అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు.ఈ కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.2009లో కరిష్మా,సన్నీకి స్థానిక న్యాయస్థానం శిక్ష విధించింది.కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడిస్తూ 2010లో సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.వారి పిటిషన్‌ను పరిశీలించిన సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేయాలని కోరింది.ఇక అంతా సర్దుమణిగింది అనుకుంటుండగా ఈ కేసు మళ్లీ వెలుగులోకి రాగా,మళ్లీ కరిష్మా,సన్నీపై కేసులు నమోదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: