‘సాహో’ నుండి ‘సైరా’ వరకు అత్యంత భారీ సినిమాల నిర్మాణం ఒక ట్రెండ్ గా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మారిపోయింది. దీనితో టాప్ హీరోల సినిమాలకు కనీసం 50 కోట్ల పెట్టుబడి ఒక సాధారణ విషయంగా పరిగణింప బడుతోంది. 

అయితే ఇప్పటి వరకు 100 సినిమాలలో నటించిన బాలకృష్ణకు చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్ పెరగకపోవడంతో అతడితో భారీ సినిమాలు తీయడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో తనకు రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటితో మరొక మూవీని చేయడానికి అంగీకరించిన బాలకృష్ణ ఆ సినిమా బడ్జెట్ విషయంలో ఆ మూవీ నిర్మాతలు ధైర్యం చేస్తున్నా బాలయ్య అడ్డు తగలడం దర్శకుడు బోయపాటికి తలనొప్పిగా మారినట్లు టాక్.

ఈ మూవేని నిర్మించబోతున్న ద్వారకా క్రియేషన్స్ రవీంద్ర రెడ్డి ఈ మూవీ పై 60 కోట్లు బడ్జెట్ పెడతానని ముందుకు వచ్చినా అంత బడ్జెట్ వద్దని ఈ మూవీని 40 కొట్లలో ముగించమని బాలయ్య స్పష్టమైన సలహాలు ఇచ్చినట్లు టాక్. దీనికి కారణం తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బడ్జెట్ పెరగడంతో ఆ మూవీ సక్సస్ అయినా ఆమూవీ నిర్మాతలకు పెద్దగా లాభాలు రాకపోవడం తనకు బాథకలిగించిన విషయాన్ని బాలయ్య ద్వారకా క్రియేషన్స్ రవీంద్ర రెడ్డితో చెప్పినట్లు టాక్.

అంతేకాదు తాను ఎంతో భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే ఆమూవీ వల్ల బయ్యర్లు నష్టపోయిన పరిస్థితులు తనకు బాధను కలిగించాయని అందువల్ల తన మార్కెట్ పెరగకుండా తన పై ఎక్కువ ఖర్చు పెట్ట వద్దని బాలయ్య స్పష్టంగా బోయపాటికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బాలయ్య అతి మంచితనం చూసి భారీ సినిమాల నిర్మాణానికి అలవాటు పడిన బోయపాటి ఈ మూవీ బడ్జెట్ ను ఎలా తగ్గించాలి అంటూ తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: