సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఉంటే మాత్రం సరిపోదు. అదృష్టం కూడా ఉండాలంటారు. అదీ గాక అసలు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టం. ఇప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలుగొందుతున్న వారందరూ ఎప్పుడో ఒకప్పుడు అలాంటి కష్టాల్ని అనుభవించినవారే. ఒక్క అవకాశం కోసం ఎదురు చూసినవాళ్లే. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, తాను దర్శకుడిగా మారకముందు ఎలాంటి కష్టాలు పడ్డాడో చెప్పుకొచ్చాడు.


గద్దలకొండ గణేష్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తనకి చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టమని, ఎప్పటికైనా సినిమా దర్శకుడిని కావాలనే తపనతో కలలు కనేవాడినని ఆ ప్యాషన్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పాడు. అయితే మొదట్లో తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయట.


ఒకానొక దర్శకుడి వద్ద అసిస్టెంట్ గా చేరి స్క్రిప్ట్ పనుల్లో రెండేళ్ళు కష్టపడ్డాడట. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా లిస్ట్ లో తన పేరు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఇదేంటని దర్శకుడిని అడిగితే ఏదో సమాధానం చెప్పి తప్పించుకున్నాడట. దాంతో ఆ సినిమా నుండి బయటకు తప్పుకున్నాడట. సినిమాకి పనిచేసినందుకు గాను పైసా రాకపోగా తన రెండేళ్ళ కష్టం కూడా వృధా అయిందని చెప్పుకొచ్చాడు.


ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమా ఈరోజే విడుదలైంది. ఈ సినిమాకి మొదటి నుండి వాల్మీకి అనే పేరును కన్ఫార్మ్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ పేరును గద్దలకొండ గణేష్ గా మార్చారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ తెలుగు రీమేక్ గా  గద్దల కొండ గణేష్ రూపుదిద్దుకుంది. ఈరోజే రిలీజైన ఈ సినిమాకి పాజిటావ్ టాక్ వచ్చిందని వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: