మెగాహీరో వరుణ్ నటిస్తున్న వాల్మీకి చిత్రం టైటిల్ వివాదానికి తెరపడింది.  వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన 'వాల్మీకి' చిత్రం టైటిల్ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రం పేరుని 'గద్దలకొండ గణేష్'గా మార్చింది. గత కొంతకాలంగా బోయ సామాజిక వర్గం నుండి ఎదురవుతోన్న ఆందోళన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మద్య చిత్రం టైటిల్స్, డైలాగ్స్, కాపీ కథల విషయంలో ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. మొదటి సారిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు..అంతే కాదు ఆయన నటిస్తున్న గద్దలకొండ గణేష్ పాత్ర కూడా నెగిటీవ్ షేడ్స్ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం టైటిల్ పేరు అనౌన్స్ మెంట్ చేసిన తర్వాత..టీజర్ చూసి వాల్మీకి పేరుతో ఓ మాఫియాను తెరపై చూపిస్తారా అని వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై చిత్రబృందానికి, వరుణ్ తేజ్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో సినిమా పేరు మారుస్తున్నట్లుయూనిట్ కోర్టుకి తెలియజేసింది. 'వాల్మీకి' పేరుని 'గద్దలకొండ గణేష్' గా మారుస్తామని వెల్లడించింది.  వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ చిత్రం జిగర్తాండ కు రీమేక్ గా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. 


తాజాగా ఈ మూవీలోని డైలాగ్స్ : 

- చింతపండు ఈజ్ నాట్ ప్రొఫెషన్ - ఇటీజ్ మై ఎమోషన్ 

- నా మీద పందాలు వేస్తే గెలుస్తారు - నాతో పందాలు వేస్తే పోతారు !

-అంత మనుష్యులంరా.... సుఖంగా బ్రతికాలనుకునే స్ధాయనుండి - సుఖంగా పోతే చాలనుకుంటున్నారు

-అందుకే పెద్దోళ్ళు చెప్పారు నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే, రెండు బుల్లెట్లు కాల్చుకుని... రెండు దాచుకోవాలని

మరింత సమాచారం తెలుసుకోండి: