రవితేజ నటించిన షాక్ సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకునిగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. షాక్ డిజాస్టర్ అయినప్పటికీ మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలు హిట్ కావటంతో హరీష్ శంకర్ కు వరుసగా అవకాశాలొచ్చాయి. కానీ గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ నుండి ఆ రేంజ్ హిట్ రాలేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గత కొన్ని సినిమాలను పరిశీలిస్తే ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ విషయంలో హరీష్ ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. 
 
హరీష్ జూనియర్ ఎన్టీయార్ కాంబినేషన్లో వచ్చిన రామయ్యా వస్తావయ్యా సినిమా ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంది. కానీ సినిమా సెకండాఫ్ విషయంలో పొరపాట్లు జరగటంతో రామయ్యా వస్తావయ్యా ప్లాప్ అయింది. హరీష్ సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. 
 
అల్లు అర్జున్ హరీష్ కాంబినేషన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా విషయంలో కూడా సెకండాఫ్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ ను అద్భుతంగా తీస్తున్న హరీష్ శంకర్ ఇంటర్వెల్ తో సినిమాపై భారీగా అంచనాలు పెంచి సెకండాఫ్ లో ఆ అంచనాలను అందుకోలేకపోవటంతో హరీష్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఈరోజు వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా విడుదలైంది. 
 
మరి హరీష్ శంకర్ గత సినిమాల సెకండాఫ్ విషయంలో జరిగిన తప్పుల్ని గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమా విషయంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడో లేదో చూడాలి. ఈ సినిమాతో హరీష్ శంకర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: