డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మొదట ఫిక్స్ చేసిన ‘వాల్మీకి’ సినిమా టైటిల్ పై ఇటీవల అనేక వివాదాలు నెలకొన్న విషయం అందరికీ తెలిసినదే. ముఖ్యంగా వాల్మీకి బోయ కులానికి చెందిన వ్యక్తి అని అటువంటి మహనీయుడు పేరును ఈ విధంగా ఒక మాఫియా సినిమాకి వాడుకోవడం అంటే మా భావోద్వేగాలతో ఆడుకోవడమే అంటూ బోయ కులానికి చెందిన ప్రముఖులు సినిమా టైటిల్ మార్చాలని హైకోర్టు కి వెళ్లడం జరిగింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సినిమా ఆగిపోయే పరిస్థితి రావడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా దర్శకనిర్మాతలు వాల్మీకి సినిమా టైటిల్ ని 'గద్దలకొండ గణేష్' అనే టైటిల్ పెట్టే రిలీజ్ చేయడం జరిగింది.


దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలామంది డైరెక్టర్ హరీష్ శంకర్ కి నెటిజన్లు మరియు మెగా అభిమానులు అండగా నిలిచారు. ఇటువంటి రోజుల్లో కూడా ఇలాంటి గొడవలు జరగడం హాస్యాస్పదమని ఎటువంటి సమాజంలో మనం ఉన్నామో ఎవరికి అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై టైటిల్ మార్పు పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి ట్విట్టర్ వేదికగా స్పందించారు.


  ''ఇది చాలా బాధాకరం. ఏ దర్శకుడు, సినిమా ఇలాంటి బాధలు పడటానికి అర్హులు కాదు. హరీశ్.. మేమంతా మీతో ఉన్నాం. సినిమా పట్ల మీకు ఎంతటి కమిట్‌మెంట్ ఉందో మా అందరికీ తెలుసు. ‘గద్దలకొండ గణేశ్’ తప్పకుండా విజయం సాధిస్తుంది'' అంటూ రాసుకోస్తూ...హరీష్ శంకర్ కి అండగా వంశీ పైడిపల్లి నిలబడ్డారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: