మొత్తాన్ని ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూపులు చూస్తున్న వాల్మీకి, అదేనండి మన గద్దలకొండ గణేష్ నేడు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చాడు. అయితే వచ్చిరాగానే తొలి ఆట తోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నట్లు ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా తొలిసారి తన కెరీర్ లో గద్దలకొండ గణేష్ అనే పక్కా మాస్ పాత్రలో నటించిన వరుణ్ తేజ్, తన క్యారెక్టర్లో జీవించాడని అంటున్నారు. జిగర్తాండ అనే తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు హరీష్ కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారని, 

అవి ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్టైల్, యాక్షన్, డైలాగ్ ఎంతో అదిరిపోయాయని సమాచారం. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి అనే పాత్రలో నటించిన పూజ హెగ్డే పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు ప్రేక్షకులు. ఇప్పటికే అరవింద సమేత, మహర్షి సినిమాలతో మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న ఈ గోల్డెన్ లెగ్ భామ, ఈ సినిమాలో ఒకరకంగా వరుణ్ నే బీట్ చేసే రేంజ్ లో కొన్ని సీన్స్ లో నటన ఇరగదీసిందని సమాచారం. 

1980వ దశకం నాటి ఆమె కట్టు, బొట్టు నడవడిక సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని, ఇకపోతే ఆమెకు వేసిన మేకప్ కూడా చాలా నాచురల్ గా ఉందని, అలానే డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఆమెకు సెట్ అయినట్లు చెప్తున్నారు. ఇక సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ముందుకు తీసుకెళ్లారని, దాదాపుగా ఎక్కడగా కూడా సదరు ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించినట్లు టాక్. మొత్తంగా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన గద్దలకొండ గణేష్ ని చూస్తుంటే, మాంచి గట్టి హిట్టే కొట్టేసేలా కనపడుతున్నాడు. మరి ఎంతమేర హిట్ అందుకుంటాడో తెలియాలంటే మరికొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: