టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్ మసాలా సినిమాలను తనదైన శైలిలో తీసే పూరి జగన్నాథ్ ఇస్మార్త్ శంకర్ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ కి సరైన హిట్ పడలేదు. సినిమాల మీద సినిమాలు తీస్తున్న సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో పూరి పనైపోయిందంటూ వార్తలు వచ్చాయి.


అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఇస్మార్ట్ శంకర్ తో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో రామ్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎప్పుడూ సాఫ్ట్ గా లవర్ బాయ్ గా కనిపించిన రామ్ ని మాస్ లుక్ లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. హైదరబాదీ కుర్రాడిగా రామ్ చెప్పే డైలాగులు ప్రేక్షకులని అలరించాయి. చాలా రోజులుగా విజయాలు లేని రామ్ కి ఇస్మార్ట్ శంకర్ మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ చిత్రంతో నష్టాల్లో ఉన్న పూరీ కూడా బయటపడ్డాడు.


 
సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా డిజిటల్ మీడియంలోకి ఇంకా రాలేదు. కనీసం వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో అప్ లోడ్ కూడా చేయలేదు. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు డిజిటల్ మీడియంలోకి వచ్చేశాయి. ఇస్మార్త్ శంకర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇస్మార్త్ శంకర్ డిజిటల్ రైట్స్ రికార్డు ధరలకి అమ్ముడు పోయాయి.


జీ 5 ఈ హక్కుల్ని కొనుక్కున్నారు. జీ5 యాప్ తో పాటు జీ తెలుగులో కూడా ప్రసారం చేయనున్నారు.జీ 5 యాప్‌ లో రావడానికి ముందే పబ్లిసిటీ చేయడానికి కాబోలు యూట్యూబ్‌లో కొన్ని సన్నివేశాలను అప్‌లోడ్‌ చేయనున్నారు. అక్టోబరు నుండి ఈ సినిమా జీ 5 యాప్ లో సందడి చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: