మెగా ప్రిన్స్ వరుణ్  తేజ్ నటించిన తాజాగా రిలీజ్ అయిన గద్దలకొండ  గణేష్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ  ఇచ్చినప్పటికీ కెరీర్ మొదటి నుంచి భిన్నమైన కథలను  ఎంచుకుంటూ  ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. అందుకే ప్రేక్షకుల్లో కూడా వరుణ్ తేజ్ మూవీ వస్తుంది అంటే ఏదో మంచి కథ అయి ఉంటుందన్న భావన కలుగుతుంది. అయితే నేడు తాజాగా విడుదలైన గజ్జలకొండ గణేష్ (వాల్మీకి) సినిమాలో  మాస్ లుక్ తో ఇప్పటికే ఎంతోమందిని అట్రాక్ట్  చేయగా... సినిమాలో పర్ఫెక్ట్ టైమింగ్ యాక్టింగ్ తో  అందరిని ఫిదా చేస్తున్నాడు. గజ్జలకొండ గణేష్ సినిమాలో  వరుణ్ తేజ్  యాక్టింగ్ గెటప్ కామెడీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పూజా హెగ్డే మేకప్ అందం అన్ని అదరహో అనిపించాయి. ఇక సినిమాకి ఎల్లువొచ్చి గోదారమ్మ పాట ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. 

 

 

 ఇక వరుణ్తేజ్ యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి డైలాగ్ లో  చూపిస్తూ పర్ఫెక్షన్ అంటే ఏంటో  చూపించాడు. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి... మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇద్దరినీ  మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో వరుణ్ తేజ్  యాక్టింగ్ అలా ఉంది. అరెరే ఏం పర్ఫెక్షన్ ఏం పర్ఫెక్షన్ ఈ ఒక్క సినిమాతో వరుణ్ తేజ్ స్టార్ హీరో అయిపోతాడు  అనడంలో  అతిశయోక్తి లేదు. చివరి నిమిషంలో వాల్మీకి గా ఉన్న టైటిల్ని గజ్జలకొండ గణేష్ గా మార్చినప్పటికీ సినిమాకి టైటిల్ ముఖ్యం కాదు కంటెంట్ ముఖ్యం అని ప్రూవ్ చేసింది ఈ సినిమా . మెగాస్టార్ ని పవర్ స్టార్ ని మిక్స్ చేస్తే యాక్టింగ్ ఎలా  ఉంటుందో అని చెప్పడానికి ఈ సినిమాలో వరుణ్ యాక్టింగ్ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదేమైనా గజ్జలకొండ గణేష్ సినిమా మాత్రం అదరహో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: