మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన నటులంతా కలిస్తే ఓ క్రికెట్ టీమ్ అంత ఉంటుందని తెలుగు సినిమా ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోల్లో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఈరోజు రిలీజైన వాల్మీకి సినిమాలో గద్దలకొండ గణేశ్ పాత్రలో తన రూపాన్ని, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకుని తనలోని మంచి నటుడున్నాడని నిరూపించుకున్నాడు.
 


 
తమిళ ఒరిజినల్ లో గద్దలకొండ గణేశ్ పాత్రకు జాతీయ అవార్డు వచ్చింది. అటువంటి ఛాలెంజింగ్ పాత్రను సాహసించి చేసిన వరుణ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఊర మాస గెటప్ లో వరుణ్ పలికిన డైలాగులు, హావభావాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. కెరీర్లో మొదటిసారి చేస్తున్న మాస్ క్యారెక్టర్ అని కాకుండా ‘మాస్’ తమ కుటుంబ వారసత్వమనే ధోరణిలో వరుణ్ చాలా ఈజ్ తో చేశాడు. వరుణ్ కెరీర్లో ఇప్పటి వరకూ ఇదే బెస్ట్ కెరీర్ ఆప్షన్ అని చెప్పాలి. వాల్మీకిలో వరుణ్ ను చూడగానే చిరంజీవి క్లాసిక్ పున్నమినాగు గుర్తు రాక మానదు. ఆ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ లో బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చిరంజీవి.. ఇండస్ట్రీకి ఓ మంచి నటుడు దొరికాడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం వాల్మీకిలో వరుణ్ చేసిన క్యారెక్టర్ షేడ్స్ అంతే డిఫరెంట్ గా ఉండి మెగా వారసత్వాన్ని తెలియజేస్తున్నాయి.
 


 
తొలి చిత్రం ముకుంద నుంచి ఇప్పటి వాల్మీకి వరకూ ప్రతి సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్. ఈ సినిమాలో వరుణ్ మాస్ రోల్ తో పెదనాన్న చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టాడనే చెప్పుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ముందుకెళ్తే వరుణ్ టాలీవుడ్ కు ప్రామిసింగ్ హీరో అవడం గ్యారంటీ.



మరింత సమాచారం తెలుసుకోండి: