అనేక వివాదాల నడుమ 'వాల్మీకి' టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు నేడు తేరా మీదికి రానుంది. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. యూఎస్‌లో  సినిమాను చూసిన కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారునిజానికి  మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే టైటిల్‌తో సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది.

కానీ, సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు దిగడం.. ఆఖరి నిమిషంలో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చాల్సిరావడం బాధాకరం. అయినప్పటికీ ‘గద్దలకొండ గణేష్’కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. 

గద్దలకొండ గణేష్ పాత్రలో ఆయన నటన, మేనరిజం, డైలాగ్ కమాండ్ అరాచకం అంటున్నారు. హరీష్ శంకర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు.తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ అవలీలగా చెప్పేశాడని.. హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్‌లో బాగా పేలాయని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా సినిమాలో ప్రతీ అంశం ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: