‘సైరా’ మూవీలో మెయిన్ హీరోయిన్ నయనతార. అయితే ఈ మూవీలో తమన్నా కూడ నటించింది. వాస్తవానికి తమన్నా నటించిన ఈ పాత్రకు చాలామంది క్రేజీ హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు. 

అయితే వారంతా నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నటించడం వలన తమకు అదనంగా కలిసి వచ్చే క్రేజ్ ఏమిలేదు అన్న ఉద్దేశ్యంతో చరణ్ స్వయంగా అడిగినా చాలామంది టాప్ హీరోయిన్స్ సున్నితంగా తమ డేట్స్ లేవు అంటూ రకరకాల కారణాలు చెప్పి ‘సైరా’ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా చాలామంది హీరోయిన్స్ ‘సైరా’ లో నటించే అవకాసం వదులుకోవడం వెనుక ఒక ఆసక్తికర కారణం వినిపిస్తోంది. 

తమన్నా ‘సైరా’ లో నటించిన పాత్ర రాజ నర్తకి పాత్ర. ఆ రోజులలో జమిందారీ సంస్థానాలలో ఒక వేశ్యను రాజనర్తకిగా పెట్టుకునే వారు. ఆమె తన నాట్యంతో ఆ జమిందారునీ లేదంటే ఆ సంస్థాన అధినేతను తన నాట్యంతో వారిని మెప్పిస్తూ ఉండటం వారి బాధ్యత. అటువంటి రాజ నర్తకి పాత్ర తమన్నా నటిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని ప్రేమించే ఆ పాత్ర ఉయ్యాలవాడ ప్రభావంతో బ్రిటీష్ వారి పై ఉయ్యాలవాడ తో కలిసి తిరుగుబాటు చేస్తుంది. 

ఈపాత్రను చాల పవర్ ఫుల్ గా మలచడమే కాకుండా ‘సైరా’ ట్రైలర్ లో కూడ హైలెట్ చేసారు. దీనికితోడు ఈ మూవీ ప్రమోషన్స్ కు మీడియా ఇంటర్వ్యూలకు మెయిన్ హీరోయిన్ నయనతార అందుబాటులో లేకపోవడంతో చిరంజీవి పక్కన తమన్నా హైలెట్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడ నయనతార అందుబాటులో లేకపోయిన పరిస్థితులలో ఇప్పుడు మీడియా దృష్టి అంతా చిరంజీవి పక్కన నిలబడి  ఉండే తమన్నా వైపే ఉంటుంది. దీనితో నయనతార పరోక్షంగా తమన్నా క్రేజ్ పెరిగే విధంగా సహకరిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: