తన సొంత కథలు ఇవ్వలేని విజయాలు  ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కు  రీమేక్ సినిమాలు  విజయాన్ని అందించాయి. అయితే ఇందులో  హరీష్ క్రెడిట్  ఏం లేదా అంటే .. చాలానే వుంది. ఎందుకంటె రీమేక్ అనగానే  ఒరిజినల్  ను చూసి సీన్ టు సీన్ కాపీ చేసి  వచ్చిన రీమేక్  సినిమాలను గతంలో చాలానే చూశాం కానీ హరీష్ ఆకోవకు చెందిన డైరెకర్ కాడు. కేవలం ఒరిజినల్ వెర్షన్ లోని మూల కథను మాత్రమే తీసుకుని తన స్టైల్ ట్రీట్మెంట్ తో రీమేక్ సినిమాలు తెరకెక్కిస్తాడు.  అలా ఆయన దర్శకత్వంలో  వచ్చిన మొదటి రీమేక్ సినిమా గబ్బర్ సింగ్.  దబాంగ్ కు రీమేక్ గా తెలుగు నేటివిటీ కి  అనుకూలంగా మార్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాడీ  లాంగ్వేజ్ కు తగట్లు పంచ్ డైలాగులును జోడించి గబ్బర్ సింగ్ ను ప్రేక్షకులముందుకు తీసుకొచ్చాడు హరీష్.  ఇక ఆచిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో  అందరికి తెలిసిందే. 





ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత కోలీవుడ్ లో విజయం సాధించిన జిగర్ తండా ను హరీష్  తెలుగులో గద్దలకొండ గణేష్ పేరు తో రీమేక్ చేశాడు.  వరుణ్ తేజ్ నటించిన  ఈ చిత్రం  ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. గబ్బర్ సింగ్ లాగానే  రూరల్ బ్యాక్ డ్రాప్ లో  తెలుగు నేటివిటీ కి తగ్గట్లు  తనదైన మార్క్ కామెడీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హరీష్ శంకర్.. ఫలితంగా ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది.  అయితే విడుదలై ఒక్క రోజు కూడా కాకముందే  బ్లాక్ బాస్లర్ అని చెప్పడం అతిగానే ఉంటుంది కానీ వరుణ్ నటించిన  గత చిత్రాలు  ఫిదా ,తొలిప్రేమ ,ఎఫ్ 2కు  హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో వసూళ్లను సాధించాయో మనం చూశాం. మరో ఇప్పుడు ఏకంగా  గద్దలకొండ గణేష్ కు బ్లాక్ బాస్టర్ టాకే వస్తుంది. దాంతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాదిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి: