మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్  విలన్ గా నటించిన  వాల్మీకి సినిమా పేరును కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ గురువారం రాత్రి కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.చాలా రోజుల తరువాత హరీష్ శంకర్ కి మంచి హిట్ వచ్చింది అని అంటున్నారు.వరుణ్ తేజ్ నటనపై  ప్రశంసలు జల్లు కురుస్తుంది .

ఈ సినిమాలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన" దేవత" సినిమాలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. శోభన్ బాబు మరియు శ్రీదేవి లపై షూట్ చేసిన ఈ పాట ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటి.ఈ పాటకు హరీష్ శంకర్  న్యాయం చేస్తాడా అనే  అనుమానం అందరిలో ఉండేది. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ  ఈ పాటను హరీష్ శంకర్ చాలా బాగా చిత్రికరించాడు.


 ఈ పాటలోని   ప్రతి ఫ్రేమ్  చాలా అందంగా ఉంది. వరుణ్ తేజ్ ఉంగరాల జుట్టు, కొంటె చూపులు , పూజా హెగ్డే డ్యాన్స్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకవచ్చాయి . సినిమాలో ఈ పాట వచ్చే ఐదు నిమిషాలు ప్రేక్షకులు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లతారు .ఈ పాటలో వరుణ్ తేజ్ రొమాంటిక్ ఎక్స్ ప్రేషన్స్ 80 వ దశకం చిరంజీవి ని  గుర్తుకు తెస్తాయి .ఈ పాటలో  కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు సింపుల్ బట్ మార్వలెస్  కొరియోగ్రాఫ్ చేశాడు.వెల్లువచ్చి గోదారమ్మ పాట చాలా బాగుందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి క్లాసిక్ పాటను ను రీమేక్ చేయడంలో హరీష శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: