తెలుగు ఇండస్ట్రీలో విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న వరుణ్ తేజ్ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు.ముందు ఈ సినిమా వాల్మీకి గా ప్రచారం జరిగి,ఆ తర్వాత గద్దలకొండ గణేష్ గా మారి ఈరోజు విడుదలైంది.ఇంతకు ముందు ఒక స్పేస్ థ్రిల్లర్,ఎఫ్2లో ఒక రొమాంటిక్ కామెడీ చేసిన తర్వాత వరుణ్ పూర్తి స్థాయి పక్కా మాస్ క్యారెక్టర్ ను వాల్మీకిలో చూపించాడు.ఇక వరుణ్ తేజ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు.తన ఆహార్యం,డైలాగ్ డెలివరీ ఇలా అన్నిట్లో వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నాడు.ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ వరుణే.ఇకపోతే తమిళ నటుడు అధర్వ బాగానే చేసాడు.



ఒరిజినల్తో పోలిస్తే ఇందులో తన పాత్రను కొంచెం తగ్గించేశారనిపిస్తుంది,పూజ హెగ్డే పాత్ర విషయానికి వస్తే ఉన్నంతలో బాగానే అలరించింది.మరో నటి మృణాళిని తన నటనతో బాగానే ఆకట్టుకుంటుంది.మిగతా నటులతో పాటుగా బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో దుమ్మురేపాడు.ఇక సినిమా విషయానికి వస్తే,హరీష్ శంకర్ ప్రధాన బలం ఎంటర్టైన్మెంట్.ఆ విషయంలో ఈ సినిమా నిరాశపరచదు.సినిమా మొదలైన కాసేపటికే మనల్నిఎంగేజ్ చేస్తుంది.ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రస్ట్‌గా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్ బ్లాక్ లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.



సెకండ్ హాఫ్ పై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేస్తాయి.ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను హరీష్ శంకర్ ఇందులో యాడ్ చేసాడు.ఈ యాడ్ చేసిన ఎపిసోడ్ బాలేదు అనిపించదు,కాని అలా వెళ్ళిపోతుంది.ఇక  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మాస్ ప్రేక్షకులను ఒకచోట కూర్చోనీయకుండా వారిచేత విజిల్స్ వేయిస్తుంది. మొత్తానికి వాల్మీకి వరుణ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమానే కాకుండా హ్యాపీగా చూడదగ్గ చిత్రం.ఇక ఇది మాస్ చిత్రం కాబట్టి ఈ సినిమా కలెక్షన్ రేంజ్ ను ఇప్పుడే చెప్పలేం. హిట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం అధికంగా కనిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: