మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్..ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ వచ్చారు.  ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమాలో కాస్త మాస్ గా కనిపించినా..అది పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి ఈ మూవీ విడుదలకు ముందు చివరి క్షణంలో 'గద్దలకొండ గణేష్' గా టైటిల్ మారింది. వాస్తవానికి ఈ మూవీ టైటిల్ పెట్టినప్పటి నుంచి ఎంతో రచ్చ అవుతూ వచ్చింది..ఇక లాభం లేదు అనుకొని నిన్న టైటిల్ మార్చి సినిమా ఈ రోజు రిలీజ్ చేశారు. 


ఏది ఏమైనా శుక్రవారం రోజు గద్దలకొండ గణేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిలీవ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో వరుణ్ తేజ్ లుక్ గురించి ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు.  ఇది కదా మెగా మాస్ లుక్ అంటే అంటున్నాు. వరుణ్ తేజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గెటప్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. హరీష్ శంకర్ డైలాగులు బాగా పేలాయి. పూజా హెగ్డే కనిపించింది 20 నిమిషాలే అయినా ఆకట్టుకుంది. ఈ మూవీలో కామెడీ కూడా వర్కౌట్ అయిందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.


గత కొంత కాలంగా హరీష్ శంకర్ కి ఏ మూవీ అచ్చిరావడం లేదు. తాజాగా  ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) సూపర్ హిట్ అందుకున్నాడని అందరూ అంటు న్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ లుక్, డైలాగ్స్, యాక్షన్ కి తిరుగు లేదని తెగ మెచ్చుకుంటున్నారు. వరుణ్ కూడా ఈ మద్య అపజయాలు చవిచూస్తున్న సమయంలో ఈ సినిమా మంచి బూస్టింగ్ అని అంటున్నారు. తాజాగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుణ్ తేజ్ కూడా మాస్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: