మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం వాల్మీకి.ఈ చిత్రంపై మెగా అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయలేదు వరుణ్ తేజ్..ఇప్పటి వరకు క్లాస్ పాత్రల్లో ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ ఈ సినిమాలో పక్కా మాస్ రౌడి పాత్రలో నటించి తన యాక్టింగ్‌లోని మరో కోణాన్ని బయట పెట్టాడు.సినిమా చూస్తున్నంత సేపు ఈ పాత్రలో నటించింది అసలు మన వరుణ్ కాదేమో అనిపిస్తుంది.మాస్ పాత్రలో ఎంత పరిణితిని కనబరచాడు వరుణ్.ఇదంతా క్రెడిట్ హరీష్శంకర్‌కే చెందాలి ఎందుకంటే స్మార్ట్‌గా వుండే వరుణ్ ను పక్కా మాస్ గా తయారు చేసాడు.



ఇక కన్నడలో ఇదే చిత్రం రీమేకై అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది బాబీ సింహ పోషించిన పాత్రను అక్కడ రవిశంకర్ చేసాడు.కన్నడలో కూడా ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ బాబీ సింహకు ఎటువంటి ఇమేజ్ లేకపోవడంతో పాత్రను తీర్చిదిద్దడానికి స్వేచ్ఛ పెరిగింది.అలాగే రవిశంకర్ కు వయసుకు తగ్గ పాత్ర కావడంతో అక్కడా వర్కౌట్ అయింది.కానీ తెలుగులో అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వరుణ్ తేజ్ రైజింగ్ స్టార్.సాఫ్ట్ ఇమేజ్ తో ఫిదా,ఎఫ్ 2 వంటి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు.మరి తనకున్న ఇమేజ్ కు భిన్నంగా వెళ్లిన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాత్రలో ఎంతగానో ఇరగ తీసాడు.మొత్తానికి డైరెక్టర్ హరీష్ శంకర్ మసిపూసి మారేడుకాయను చేసి ఫన్నీగా వున్న ఎఫ్2 బాయ్ ని గద్దలకొండ గణేష్ గా మార్చి హిట్‌ను స్వంతం చేసుకున్నాడు.



మరో విషయం ఏంటంటే హరీష్ శంకర్ కు ఎంటర్టైన్మెంట్ ఎలా రాబట్టాలో బాగా తెలుసు.ముఖ్యంగా అది రీమేక్ సినిమా అయితే హరీష్ పని ఇంకా సులువవుతుంది.అప్పుడు గబ్బర్ సింగ్ కు చేసినట్లుగానే ఇప్పుడు వాల్మీకి కి కూడా అదనపు ఆకర్షణలు జోడించాడు హరీష్ శంకర్.ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను జోడించాడు.అందులో పూజ హెగ్డేను పెట్టి సినిమాకు గ్లామర్ తీసుకొచ్చాడు.సూపర్ హిట్ సాంగ్ “ఎల్లువొచ్చి గోదారమ్మ”సాంగ్ ను రీమిక్స్ చేయించాడు. దర్శకుడు సుకుమార్ చేత ఒక కామియో రోల్ వేయించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: