వాల్మీకి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. రెస్పాన్స్ కు తగ్గట్టుగానే మెగా హీరోలు కూడా స్పందిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలు పూర్తి చేసుకున్నారు.  151 వ సినిమా సైరా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  మెగాస్టార్ సినిమా రిలీజైతే మిగతా సినిమాలన్నీ సైడ్ అవ్వాల్సిందే. ఈలోపుగా గద్దలకొండ గణేష్ వీలైనంతగా వసూళ్లు సాధించాలి. మెగా కుటుంబం నుంచి మెగాస్టార్ కు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో చెప్పక్కర్లేదు.  అటు పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.  


సొంత ఇమేజ్ తోనే ఎదిగారు.  కళ్యాణ్ సినిమా వస్తే బాక్స్ బద్దలు కావాల్సిందే.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సినిమా రంగంలోకి తిరిగి అడుగుపెట్టేది లేదని స్పష్టంగా చెప్పారు. అయితే, నాగబాబు మాత్రం హీరోగా స్థిరపడలేకపోతారు.  కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు.  నిర్మాతగా మారి సినిమాలు తీసినా పెద్దగా ఉపయోగపడలేదు.  మెగా హీరోలు ముగ్గురిలో నాగబాబు మినహా మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లు హీరోలుగా మంచి విజయం సాధించారు.  


ఆ తరువాత మెగాస్టార్ కొడుకుగా అడుగుపెట్టిన రామ్ చరణ్ సినిమా రంగంలో ఇప్పుడు టాప్ హీరో.  మగధీరతో ఆ స్టామినా సాధించాడు.  ఇటీవలే చేసిన రంగస్థలం సినిమా కూడా మంచి హిట్టైంది.  ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి.  ఇది వేరే విషయం అనుకోండి.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


ఇదిలా ఉంటే మొదటి నుంచి సాఫ్ట్ పాత్రలు చేస్తూ వచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మొదటిసారి మాస్ పాత్రలో కనిపించే సరికి షాక్ అయ్యారు.  మంచి హైట్.. హైట్ కు తగ్గట్టుగా రూపం.. మాస్ పాత్ర చేసేందుకు అదే ఆయనకు కలిసి వచ్చింది.  ఉంగరాల జుట్టు, ఒత్తైన గడ్డం మాస్ అప్పీల్ కు చిహ్నంగా మారాయి.  వరుణ్ ను గద్దలకొండ గణేష్ గా డిజైన్ చేసిన హరీష్ శంకర్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  ఏదైతేనేం మొత్తానికి వరుణ్ మెగా పేరును నిలబెట్టాడు.  నాగబాబు కోరికను తీర్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: