మన టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వేరు. అంతకముందు కొన్నేళ్ల క్రితం ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు అందుకోవడంతో, ఆ తరువాత అభిమానులు ఆయన నుండి ఎటువంటి సినిమాను ఆశిస్తున్నారో తెలుసుకుని, ఎంతో శ్రమించి ఆయనతో గబ్బర్ సింగ్ అనే మాస్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించి, సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక ఆ తరువాత హరీష్ తీసిన సినిమాలు బాగానే ఆడినప్పటికీ, గబ్బర్ సింగ్ రేంజ్ విజయాలు మాత్రం అందుకోలేదు. ఇక ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ తెరకెక్కించిన వాల్మీకి సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

వరుణ్ తేజ్ తొలిసారి గద్దలకొండ గణేష్ అనే మంచి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ ని సాధించి ముందుకు సాగుతోంది. జిగర్తాండ అనే తమిళ హిట్ మూవీని తనదైన మాస్ మరియు కమర్షియల్ శైలిలో దానికి మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించిన హరీష్ శంకర్, థియేటర్  కు వచ్చే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అందించారని అంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా అప్పుడెప్పుడో పవర్ స్టార్ తో తీసిన గబ్బర్ సింగ్ తరువాత ఆ రేంజ్ లో ఈ గద్దలకొండ గణేష్ సినిమా ఉందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక వరుణ్ పలికిన డైలాగ్స్ మరియు యాక్షన్ సీన్స్ కు థియేటర్లలో విజిల్స్ మారుమ్రోగుతున్నాయట. ఇకపోతే ముకుంద సినిమాలో వరుణ్ తో కలిసి జోడి కట్టిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించింది. 

ఇక సినిమాలో శ్రీదేవి అనే అమ్మాయి పాత్రలో పూజ ఎంతో నాచురల్ గా పెర్ఫర్మ్ చేసి ఆకట్టుకుందని, అలానే శోభన్ బాబు, శ్రీదేవిల హిట్ సాంగ్ 'వెల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ లో శ్రీదేవిని పూజ తలపించిందని ఎక్కువ మంది ప్రేక్షకుల చెప్తున్న మాట. ఇక అలరించే కామెడీ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు ఈ సినిమాను మంచి సక్సెస్ చేశాయట. మరొక నటుడు అథర్వ మురళి బాగా పెర్ఫర్మ్ చేసారని, అలానే సీనియర్ నటి సుప్రియ పాఠక్ రోల్ సినిమాలో ఎంతో ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మొత్తంగా అలరించే సాంగ్స్, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, యాక్షన్, సాంగ్స్ కలగలిపి తెరకెక్కిన ఈ గద్దలకొండ గణేష్ సినిమా, రాబోయే రోజుల్లో మరింత మంచి టాక్ తో అదిరిపోయే కలెక్షన్ తో దూసుకెళ్లడం ఖాయం అని అంటున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: