వాల్మీకి సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వచ్చిన టాక్ ను బట్టి ఈ మూవీ హిట్  అయ్యినట్లే అని క్రిటిక్స్ చెబుతున్నాయి. ఇకపోతే మూవీ గురించి చెప్పాలంటే మూవీ లో వరుణ్ ది నటనకు ఏ మాత్రం తగ్గకుండా పూజ హెగ్డే నటన అదిరిపోయింది. అలనాటి హీరోయిన్ శ్రీదేవి పాత్రలో నటించింది. ఎప్పుడు గ్లామర్ గా కనిపిస్తూ వస్తున్నా పూజ ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయి గెటప్ లో అదిరిపోయింది. ఆమె నటన చాలా న్యాచురల్ గా ఒదిగి పోయి నటించారు. ఆమెకు, వరుణ్ కు  బాగా సెట్ అయింది. 


ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ బాబు పెద్దనాన్న చిరంజీవి లాగ ఉన్నారని చాలా మంది సినీ ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. ఎటు చుసిన కూడా మొత్తానికి ఫస్ట్ ఆఫ్ హరీష్ మార్క్ కనిపించేలా తెరకెక్కించారని అంటున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతానికి మిశ్రమ కలెక్షన్స్ తో ను, మిశ్రమ టాక్ తోను దూసుకుపోతుంది. మరి సినిమా పరిస్థితి గ్యాంగ్ లీడర్ లాగా కొద్దీ రోజులు థియేటర్లలో ఆడుతుందా, లేక సాహో లాగా ఒక్క రోజుకే టాలీవుడ్ లో డీలా పడుతుందో అన్న విషయం తెలియాల్సి ఉంది .. 


హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుందనే టాక్ వినపడుతుంది.ఈ సినిమా పాటలు మాత్రం సూపర్ అనిఅంటున్నారు. డైలాగులు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మరి మొత్తం సినిమా విషయానికొస్తే స్టోరీ నీ కొంచం పెంచారు దానితో సినిమా హిట్ లెవల్ తగ్గింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 14 రీళ్ల ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. 


ఈ సినిమా చూసిన నాగ బాబు ఈ సినిమా గురించి ఏమన్నారంటే.. నా కోడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వాంగా ఉంది. పెద్ద సినిమా ఎలా చేస్తాడో అనుకున్న కానీ, నేను ఊహించనేలేదు. చాలా బాగా ఉంది.ఒకవైపు అన్నను చూస్తున్నట్లు ఉంది. మరోవైపు తమ్ముడి పౌరుషం ఈ సినిమాలో వరుణ్ లో బాగా కనిపించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అంటున్నారు. నాకు చాలా గర్వాంగా ఉంది. వరుణ్ బాబు నా కొడుకు అనడం కన్నా, వాడి తండ్రిని అని గర్వాంగా పిలిపించుకుంటాను అని నవ్వుల బాబు నాగబాబు వెల్లడించారు.. చరణ్ తో అందరు సినిమా బాగుందని సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్పారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: