మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండడంతో, ఆ సినిమా యూనిట్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే సినిమాను సింగిల్ హ్యాండ్ తో తన అద్భుతమైన నటనతో ముందుకు తీసుకెళ్లిన వరుణ్ తేజ్ పై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి. గద్దలకొండ అనే మాస్ పాత్రలో నటించిన వరుణ్, ఆ పాత్రకు జీవం పోశారని, ఆ పాత్రలో ఆయన తెలంగాణ యాసలో పలికిన డైలాగ్స్, స్టైల్, యాక్షన్ అదరహో అనే రేంజ్ లో ఉన్నాయని, థియేటర్ లో సినిమాను చూసి బయటకు వచ్చిన మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్న మాట. 

ఇప్పటివరకు వరుణ్ నటించిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే  ఈ వాల్మీకి మరొక ఎత్తని అంటున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఎక్కువగా ఎంటర్టైనర్ గా నడిపించిన తీరు చాలా బాగుందని, ఎవరైనా దర్శకుడు తాను చెప్పదల్చుకున్న అంశాన్ని మంచి కమర్షియల్ పంథాలో చెపితే అది తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అనడంలో హరీష్ శంకర్ ఈ సినిమా ద్వారా రుజువు చేసి చూపారని అంటున్నారు. ఇక తెరపై హీరో వరుణ్ కు హీరోయిన్ పూజ హెగ్డే సరిగ్గా సరిపోయిందని, ఇక వారిద్దరి మధ్య వచ్చే రీమిక్స్ సాంగ్ 'వెల్లువొచ్చే గోదారమ్మ' సాంగ్ అయితే మరింత బాగుందని చెప్తున్నారు. 

ఇక ఆ సాంగ్ తో పాటు జర్ర జర్ర అనే మాస్ సాంగ్ కూడా అదిరిందని, ఆ సాంగ్ లో స్పెషల్ అఫియరెన్స్ ఇచ్చిన డింపుల్ హయతి తన డ్యాన్సింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుందని అంటున్నారు. ఇక ఇతర నటులైన అధర్వ మురళి, మృణాళిని రవి, బ్రహ్మాజీ, సుప్రియ పాఠక్, సత్య, తనికెళ్ళ భరణి తదితరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారట. ఇక కమెడియన్ బ్రహ్మానందం సర్ప్రైజింగ్ ఎంట్రీ అదిరిందని, కామెడీ పరంగా బ్రహ్మాజీ, సత్య అయితే కడుపుబ్బా నవ్విచారని అంటున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీ, చోట కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్రాణంగా నిలిచాయట. ఓవర్ ఆల్ గా తొలిసారి వరుణ్, హరీష్ ల కలయికలో వచ్చిన ఈ గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ టాక్ సంపాదించి ప్రేక్షకుల నుండి మంచి మార్కులు సంపాదించింది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: