మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్  ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన   "గద్దలకొండ గణేష్"  మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు.  ముఖ్యంగా  ఊర మాస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో  వరుణ్  జీవించాడు.  పైగా ఆ మాస్ లుక్ లో  తెలంగాణ మాండలికంలో  చెప్పిన మాస్ డైలాగ్స్  మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కాయి. థియేటర్ లో ప్రతి డైలాగ్ కి విజిల్స్ పడుతున్నాయి.  ఇప్పటి వరకూ  ఒక లవర్ బాయ్ ఇమేజ్ లో కనిపించిన వరుణ్ తేజ్, మొత్తానికి  గద్దలకొండ గణేష్ పాత్రలో  కొత్త అనుభూతి కలిగించాడు.  దీనికి తోడు  భారీ కటౌట్ లో  డీగ్లామర్ రోల్ లో పక్కా మాస్ మేనరిజమ్స్ తో వరుణ్  "గద్దలకొండ గణేష్"  సినిమాని  వన్ మ్యాన్ షోగా నడిపిపించాడు.  అలాగే  హీరోకి సమానమైన మరో పాత్ర చేసిన తమిళ నటుడు అధర్వ కూడా  యంగ్ డైరెక్టర్ గా  చక్కగా సరిపోయాడు. సీరియస్ సన్నివేశాలతో పాటు కమెడియన్ సత్య కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ లో కూడా  ఆయన తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నారు. అధర్వకు జంటగా నటించిన మృణాలిని రవి చాలా అందంగా కనిపిస్తూ  నటన పరంగా మెప్పిచింది.  వీరి కెమిస్ట్రీని ఎలివేట్ చేసే సీన్స్ కూడా హరీష్ శంకర్ చాల బాగా రాశాడు.  అలాగే  ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో 90ల కాలం నాటి అమ్మాయి గెటప్ లో  పూజా పక్కా తెలుగమ్మాయిగా  అద్భుతంగా ఉంది. ఈ లవ్ సీన్స్ కూడా బాగున్నాయి.  అన్నిటికి మించి వరుణ్ - పూజాల పై తెరకెక్కిన శ్రీదేవి, శోభన్ బాబుల హిట్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాట  సినిమాకే హైలెట్ గా నిలిచింది.   


ముఖ్యంగా ఈ  సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని భావోద్వేగాలు మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. అలాగే వరుణ్  యాక్టింగ్ అండ్ వరుణ్  క్యారెక్టర్ లోని షేడ్స్,  లవ్ స్టోరీలో  కెమిస్ట్రీ  మరియు సాంగ్స్  బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో ఆవేశంగా ఉండే     "గద్దలకొండ గణేష్"   పాత్ర‌కు వరుణ్ ప్రాణం పోసాడు.  ఓల్డ్ ఏజ్ పాత్రలో కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్  చేస్తూ సినిమాలోనే వరుణ్ తేజ్  హైలెట్ గా నిలిచాడు. సినిమాలో  సినిమాటోగ్రఫీ బాగుంది.  సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్  ఎంతో  రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో  చాలా బ్యూటిఫుల్ గా  చూపించారు.  నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.  వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.  ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ కూడా  ఈ చిత్రంలో  కీలక పాత్రలో అద్భుతంగా నటించాడు. వీరితో పాటు  పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో చాల బాగా నటించారు. ప్రముఖ నిర్మాతలు  రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఇక  ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌  ఈ సినిమాలో కూడా  మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ తో మెప్పించాడు.  అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో బాగా  హైలెట్ అయింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: