బాలీవుడ్ లో నిర్మించే సినిమాలు ఎక్కువ నిడివి ఉన్న సంగతి తెలిసిందే. లగాన్, మొహబ్బతే, కభి ఖుషి కభి ఘం, దంగల్..ఇలా చెప్పుకుంటు పోతే చాలా సినిమాలే ఉన్నాయి. కాకపోతే బాలీవుడ్ లో చాలా సినిమాలు మల్టీ స్టారర్ కాబట్టి అంత నిడివితో తెరకెక్కిస్తారు. పైగా హిందీ ఆడియన్స్ కూడా చూస్తారు. కాని మన తెలుగు సినిమాలు నిడివి ఎక్కువగా అనిపిస్తే ఎందుకనో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. రెండవసారి థియోటర్ కి రావడానికి ఆలోచిస్తున్నారు. అవును ఈ మధ్య కాలంలో వస్తున్న తెలుగు సినిమాల నిడివి అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతకాలం క్రితం వరకూ రెండు గంటల పదిహేను నిముషాల వరకే పరిమితమయ్యోవి. కొన్ని సినిమాలు అంతలోపే ఉండేవి కూడా. అయితే ఇప్పుడు సినిమాలు రెండున్నర గంటలకు చేరుకోవటమేకాదు.. ఇప్పుడు ఏకంగా మూడు గంటలకు దగ్గరైపోతున్నాయి. దీంతో జనాలు సినిమా కోసం ఎంత కాదన్నా నాలుగు గంటల వరకూ టైం కేటాయించాల్సి వస్తోంది.

సినిమాను వీలైనంత క్రిస్ప్ గా చెప్పాల్సి ఉన్నా.. తాము చెప్పాల్సిందంతా చెప్పటానికి ఈ మధ్యన మన తెలుగు దర్శకులు మూడు గంటల వరకు లాగుతున్నారు. మరి ఇదేమన్న కొత్త ఫార్ములానా అర్థం కావటం లేదు. జనాలకు కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అది ఇస్తే సరిపోతుంది కదా వాళ్ళ సహనాన్ని, సమయాన్ని ఎందుకు వృధా చేయడం.ఈ వారం రిలీజైన రెండు పెద్ద తెలుగు సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేశ్ అలియాస్ వాల్మీకి సినిమా నిడివి ఏకంగా 2-54 గంటలు ఉండగా.. సూర్య.. మోహన్ లాల్.. ఆర్య లాంటి అగ్రనటులు నటించిన డబ్బింగ్ సినిమా బందోబస్త్ కూడా 2-46 గంటలు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. 

ఈ రెండు సినిమాలే కాదు.. ఇటీవల విడుదలైన చాలా సినిమాలు రెండున్నర గంటల పైనే ఉండటం అందరి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అయితే  రివర్స్ లో హిందీ సినిమాలు మాత్రం రెండున్నర గంటలకు తక్కువగా ఉండటం విశేషం. బాలీవుడ్ సినిమాలు 2గంటల 20 నిముషాల మధ్యలోనే ఎండ్ కార్డ్ వేసేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన 'ద జోయా ఫ్యాక్టర్' సినిమా 2-16 గంటలు మాత్రమే. దుల్కర్ సల్మాన్.. సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా నిడివి ఈ వారం రిలీజ్ అయిన తెలుగు సినిమాలతో పోలిస్తే దాదాపు అరగంట తక్కువ కావటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: