టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్రలో నటించగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా పలు ఇతర భారతీయ భాషల్లోని ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్ముదులుపుతూ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. 

అయితే తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను హిందీ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయాలని సంకల్పించారు నిర్మాతలు. అయితే నేడు వారికి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ కూడా సైరా రిలీజ్ అవుతున్న గాంధీ జయంతి రోజునే రిలీజ్ కానుండడంతో, నేడు వార్ సినిమాను వీలయినన్ని ఎక్కువ థియేటర్స్ లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన యాష్ రాజ్ ఫిలింస్ వారు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. హృతిక్ మరియు టైగర్ ల సినిమా కెరీర్ పరంగా ఈ వార్ సినిమా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతోందని నిన్నటినుండి బాలీవుడ్ వర్గాలు దీనిపై వార్తలు హోరెత్తిస్తున్నాయి. 

అయితే ఇప్పుడు ఇదే కొంతవరకు సైరా నిర్మాతలకు మింగుడుపడడం లేదట. నిజానికి అదే రోజున తమ సినిమా ఉండడంతో, తాము భావిస్తున్న దాని ప్రకారం సైరాకు అక్కడ ఒకింత తక్కువ స్థాయిలో మాత్రమే థియేటర్స్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక సైరాను కూడా అక్కడి నిర్మాతలు భారీ ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో, నేడు వార్ నిర్మాతల ప్రకటన తరువాత కొంతవరకు సైరా నిర్మాతలకు లోలోపల ఆందోళన మొదలైనట్లు సమాచారం. ఈ విధంగా ఆదిలోనే బాలీవుడ్ లో సైరాకు తొలి పోటు పడినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడే అంతా అయిపోలేదని, సైరా నిర్మాతలు భావిస్తున్న మేరకు తమ సినిమాకు కొంతవరకు ఎక్కువ థియేటర్లు లభ్యం అయ్యేలా ఇప్పటినుండి ప్రయత్నాలు గట్టిగా చేస్తే దొరికే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: