మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గద్దలకొండ గణేశ్' సినిమా రీసెంట్ గా రిలీజ్ ఐన సంగతి తెలిసిందే . డే ఒన్ నుంచి సూపర్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా డే 2 పరిస్తితి కూడా ఇదే జోరు కొనసాగుతోంది .. ఎక్కడా కూడా డౌన్ అయ్యే అవకాశాలు లేకుండా స్ట్రాంగ్ గానే బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఎన్నో వివాదాస్పద ల మధ్య విడుదలైన 'గద్దలకొండ గణేశ్' - ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఈ కారెక్టర్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు .. ఈ కారెక్టర్ లో వరుణ్ తేజ్ ఆ రేంజ్ లో ఇరగదీశాడు ఏంట్రా బాబూ అని షాక్ అయిపోతున్నారు ఒక్కొక్కరు .. సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరూ మేము తెరమీద వరుణ్ తేజ్ ని చూడలేదు గద్దలకొండ గణేశ్ ని మాత్రమే చూసాము అని చెబుతుంటే అంతకంటే ఒక హీరో కి ఇంకేం కావాలి అనిపిస్తోంది.


రెండో రోజు కూడా వాల్మీకి సినిమా మంచి టాక్ తో నడుస్తోంది .. ఫామిలీ ఆడియన్స్ ఎగబడి థియేటర్ లకి వెళుతున్నారట .. కామెడీ సూపర్ గా వర్క్ ఔట్ అవ్వడం , ఒక పెద్ద రౌడీ సామాన్యుడిలా ఎలా మారాడు అనేది కథాంశం కావడం , పూజ హెగ్డే క్యూట్ యాక్టింగ్ , పాటలు బాగుండడం ఇవన్నీ ఈ సినిమా కి బాగా వర్క్ అయ్యాయి అని చెప్పాల్సిందే. సొ డే 2 మౌత్ టాక్ వర్క్ అయ్యేడట్టే కనిపిస్తోంది ఈ సినిమాకి .. బ్రహ్మాజీ కారెక్టర్ చాలా బాగుంది అంటూ థియేటర్ లోంచి బయటకి వచ్చేవాళ్లు మాట్లాడడం కనిపిస్తోంది.


ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు కుర్రాళ్ళకి బాగా నచ్చితే .. శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్ ఎల్లువచ్చి గోదరమ్మ పాత రీమిక్స్ చెయ్యడం పెద్దవాళ్ళకి జోష్ తెప్పిస్తోంది .. మొత్తం మీద చూసుకుంటే సక్సెస్ఫుల్ గా రెండో రోజు కూడా వాల్మీకి థియేటర్ లలో ఇరగదీస్తున్నాడు .. . మరొక పక్క బందోబస్త్ సినిమా టాక్ నెగెటివ్ గా ఉండడం వాల్మీకి కి కలిసొచ్చే అంశం ఎక్కువగా కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: