వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి మరియు రామ్ పోతినేని కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ద్వారా అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. మాస్ హిట్ అందుకున్న ఈ సినిమా బి, సి సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా రాకముందు భయంకరమైన అప్పుల లొ మునిగిపోయిన పూరిజగన్నాధ్...ఈ సినిమా ఇచ్చిన లాభాలతో ఒక్కసారిగా అప్పుల లొ నుండి బయటకు వచ్చి ఆర్థికంగా బౌన్స్ అయ్యాడు.


అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. ఈ సినిమా విజయం తో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు పూరి ఇస్ బ్యాక్ అని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా రామ్ పోతినేని కెరియర్లో ఎప్పుడూ ఎన్నడూ చేయని క్యారక్టర్ అది కూడా మాస్ క్యారెక్టర్ లో చేయడంతో ప్రేక్షకులు కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా రాకముందు వరకు లవర్ బాయ్ గా స్మార్ట్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన...పూరి చెప్పిన స్టోరీ కి ఫిదా అయ్యి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర అనేక రికార్డులు సృష్టించాడు.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా యూట్యూబ్ లో కూడా కొత్త రికార్డు సృష్టించినట్లు వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఈ సినిమాలో దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో జీ మ్యూజిక్ సౌత్‌లో విడుదలయ్యింది. అయితే ఈ సాంగ్ ఎంత మంది అభిమానులను సొంతం చేసుకుందో అది చెప్పనక్కర్లేదు. వీడియో యూట్యూబ్‌్‌లో పెట్టిన 8 గంటలలోపే 17 లక్షలకు పైగా వ్యూస్‌ని సంపాదించుకుని రికార్డ్ వ్యూస్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: