ఏదైనా సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే సినిమా టైటిల్ నుండే చాలా కేర్ తీసుకుంటారు. అలాంటి వారిలో యువ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా క్రేజీగా ఆలోచిస్తాడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారి హిట్ అందుకున్నాడు.


ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ సాధించిన విజయం ఆ సినిమా తెచ్చిన ఇమేజ్ అందరికి తెలిసిందే. ఆ తర్వాత గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు హిట్లు కొట్టాయి. ఈ ఇయర్ రిలీజైన డియర్ కామ్రేడ్ సినిమా నిరాశపరచినా ఆ ఫెయిల్యూర్ తాలూఖా ఎఫెక్ట్ తన నెక్స్ట్ సినిమా మీద పడకూడదని అనుకుంటున్నాడు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడే క్రేజీగా అనిపించగా శుక్రవారం రోజు సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్యూర్ పెయిన్ తో ఒండినిండా గాయాలతో చేతిలో సిగరెట్ ఎదుటివ్యక్తి మీదకు విసిరేస్తున్నట్టుగా ఉంది విజయ్ దేవరకొండ.   


ఫస్ట్ లుక్కే ఇలా అదరగొట్టగా సినిమా మరోసారి విజయ్ సత్తా చాటేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసిన వారు అర్జున్ రెడ్డి అగైన్ అంటున్నారు. సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో కలిగించిన ఇంటెన్స్ సినిమాలో ఉంచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే లెక్క. మరి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: