‘సైరా’ విడుదల కాకుండానే ఈ మూవీ పై అప్పుడే నెగిటివ్ ప్రచారం ప్రారంభం అయిపోయింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీని తెలుగు తమిళ మళయాళ కన్నడ హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేస్తూ ఈ మూవీ భారీ ప్రమోషన్ ను రేపటి నుంచి ప్రారంభిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ స్టామినా పై తమిళ మీడియా వ్యక్త పరుస్తున్న సందేహాలు హాట్ టాపిక్ గా మారాయి. 

తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీయబడిన ఈ కథ ఒక్క తెలుగువారికి తప్ప మరే భాషకు సంబంధించిన ప్రాంతం వారికీ తెలియని నేపధ్యంలో ఈ కథకు జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు అంటూ తమిళ మీడియా ప్రశ్నిస్తోంది. మెగా స్టార్ చిరంజీవికి తెలుగువారిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నా తమిళనాడులో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతంత మాత్రమే అన్న కామెంట్స్ చేసింది. 

అందువల్లనే చిరంజీవి తెలివిగా ఈ మూవీ కోలీవుడ్ కలక్షన్స్ కోసం విజయ్ సేతుపతిని నయనతారను ఈ మూవీలో కీలక పాత్రలను చేసి వారి ఇమేజ్ ద్వారా ‘సైరా’ ను తమిళనాట మార్కెట్ చేయబోతున్నారు అంటూ తమిళ మీడియా ఘాటైన సెటైర్లు వేస్తోంది.  ప్రస్తుతం విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయాలను గుర్తుకు చేస్తూ  తమిళ ప్రేక్షకులు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ అని పిలుచుకునే సేతుపతి ‘సైరా’ లో కీలక పాత్ర పోషించడం వెనుక అతడి క్రేజ్ తో ‘సైరా’ ను ఇక్కడ పాపులర్ చేయడం కోసమే అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు ఈ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర చిరంజీవిని డామినేట్ చేసేలా ఉండటంతో ఆ పాత్ర సీన్లు కొన్ని కట్ చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తే స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగి ఒక్క సన్నివేశం కూడా తొలగించ వద్దని చెప్పాడని ఇది అంతా విజయ్ సేతుపతికి ప్రస్తుతం తమిళనాడులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న వ్యూహం అంటూ తమిళ మీడియా ఘాటైన విమర్శలు చేసింది. అంతేకాదు ఈ మూవీకి తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ వస్తే అది విజయ్ సేతుపతి నయనతారల వల్ల జరుగుతుంది కానీ చిరంజీవి మ్యానియాతో ఈ మూవీకి తమిళనాడులో కలక్షన్స్ రావు అంటూ తమిళ మీడియా చేస్తున్న ప్రచారాన్ని చూస్తుంటే ‘సైరా’ పై తమిళ మీడియాకు ఎంత విద్వేషం ఉందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: