బిగ్ బాస్ లో ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లో ఉన్న ముగ్గురు సభ్యులలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతారనేది సస్పెన్స్ గా మారింది. రాహుల్, మహేష్, హిమజలఓ రాహుల్ నామినేషన్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వస్తున్నాడు. ఈ సీజన్ లో  ఎక్కువ సార్లు నామినేట్ అయిన ఘనత రాహుల్ కే దక్కింది. ఎన్ని సార్లు నామినేట్ అయినా సేవ్ అవుతున్నాడంటే అతనికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందని అర్థం అవుతుంది.


అదీగాక ఈ సారి రాహుల్ నామినేట్ అయిన విధానం జనాల్లో సింపతీని మరింత పెంచింది. ఆ సింపతీ ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక మహేష్ , హిమజల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండనుంది. ఈ వారం మొత్తంలో బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచిన హిమజ పర్ ఫార్మెన్స్ ఆమెకి ఓట్లు తీసుకొచ్చినప్పటికీ మహేష్ ని బీట్ చేయలేకపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హిమజ డాన్స్ తర్వాత మహేష్ కెప్టెన్ అయిపోయాడు.


ఆ కారణంగా మహేష్ ని సేవ్ చేసుకుందామనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారని తెలుస్తుంది. బాబా భాస్కర్ అభిమానుల ఓట్లు కూడా మహేష్ కి కలిసొచ్చే అవకాశం కలదు. అనధికార లెక్కల ప్రకారం రాహుల్ తర్వాత మహేష్ ఉన్నాడని, హిమజకి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉందని వార్తలు వస్తున్నాయి.  దీంతో హిమజ డేంజర్ జోన్ లోకి వెళ్ళిందని టాక్ వినిపిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ లో హైలైట్ గా నిలిచిన హిమజ డాన్స్ పర్ ఫార్మెన్స్ చాలా ప్రభావం చూపిస్తే తప్ప ఆమె ఎలిమినేషన్ నుండి బయటపడే అవకాశాలు కనిపించట్లేదు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: