హరీష్ శంకర్ షాక్ సినిమాతో టాలీవుడ్ లో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టాడు. అంతకుముందే కొన్ని సినిమాలకు రచయితగా పని చేసిన హరీష్ శంకర్ కు షాక్ సినిమా ఫలితం షాక్ ఇచ్చింది. షాక్ సినిమా తరువాత కూడా హరీష్ కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. షాక్ ప్లాప్ అయినప్పటికీ రవితేజ మరో అవకాశం ఇవ్వటంతో హరీష్ మిరపకాయ్ సినిమాతో హిట్ కొట్టాడు. మిరపకాయ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 
 
నిన్న వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలలో హరీష్ శంకర్ తన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. కెరీర్ మొదట్లో ఎన్నో బాధలు పడ్డానని, కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యాయని హరీష్ చెప్పాడు. ఒక దర్శకుని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక కథ కోసం దాదాపు రెండు సంవత్సరాలు పని చేశానని సినిమా ముహూర్తం రోజున అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు లేకపోవటంతో చాలా బాధ పడ్డానని చెప్పాడు. 
 
రెండు సంవత్సరాలు పడిన కష్టానికి ఒక్క రూపాయి కూడా రాకపోగా పేరు కూడా లేకపోవటంతో ఏడుపు వచ్చిందని హరీష్ శంకర్ చెప్పాడు. నిన్న విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలొస్తున్నాయి. వరుస హిట్లు కొడుతున్న వరుణ్ తేజ్ ఖాతాలో గద్దలకొండ గణేష్ విజయంతో మరో హిట్ చేరిందని చెప్పవచ్చు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. వరుణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించగా అథర్వ, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: