జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో అతడు మరొక సినిమాకు ఒప్పుకునే అవకాశం లేదు. అయినా ఈ విషయాలను పట్టించుకోకుండా అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు అందుబాటులో ఉన్న ప్రముఖ దర్శకులను జూనియర్ వద్దకు పంపి వచ్చే ఏడాది తమ సంస్థలో ఒక సినిమా చేసే విధంగా ఇప్పటి నుంచే పదకాలు రచిస్తున్నాయి. 

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ రాయబారాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తమిళ దర్శకుడు అట్లీ లతో పాటు చాలామంది దర్శకులు జూనియర్ ను కలుస్తూ తమ వద్ద ఉన్న కథలను జూనియర్ కు వినిపిస్తున్నట్లు టాక్. అయితే జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా విపరీతంగా పెరిగి పోతుంది కాబట్టి జూనియర్ తో తన సొంత నిర్మాణ సంస్థ పై ఒక సినిమాను తీసి ఆ క్రేజ్ వల్ల వచ్చే లాభాలను తానే పొందాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను పసిగట్టిన త్రివిక్రమ్ రంగంలోకి దిగి తన సొంత నిర్మాణ సంస్థగా భావించే హారికా హాసినీ ప్రొడక్షన్ హౌస్ మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లను భాగస్వాములుగా చేసి వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఒక సినిమాను ప్రారంభించే వ్యూహాలలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి జూనియర్ కూడ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత జూనియర్ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ అన్ని విధాల సరిపోతాడు అన్న ఉద్దేశ్యంతో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ కు సహాయం చేసినట్లుగా ఉంటుందని త్రివిక్రమ్ వైపు జూనియర్ మొగ్గు చూపెడుతున్నాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి.. 
.



మరింత సమాచారం తెలుసుకోండి: