అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘గ్యాంగ్ లీడర్’ ఊహించిన అంచనాలను అందుకోలేక పోవడంతో ఈమూవీ బయ్యర్లకు నష్టాలు రావడం ఖాయం అన్న విషయం నిర్ధారణ అయిపోయింది. ఈ మూవీ విడుదలై రెండవారంలోకి అడుగు పెట్టడంతో తెలుగురాష్ట్రాలలో చాలచోట్ల ఈ మూవీకి కనీసపు కలెక్షన్స్ కూడ రావడంలేదని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి నానీ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి గలకారణం నాని చేస్తున్న పోరపాట్లు అన్న కామెంట్స్ వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ తిరస్కరించిన కథను 'కృష్ణార్జున యుద్ధం' గా నటించి తన వరుస హిట్స్ కు బ్రేక్ వేసుకున్నాడు.  అక్కడితో అయినా పాఠలు నేర్చుకోకుండా అల్లు అర్జున్‌ దగ్గర రిజెక్ట్‌ అయిన విక్రమ్ కుమార్ కధను ముచ్చట పడి 'గ్యాంగ్‌లీడర్‌' గా తీయించి మరోసారి పరాజయాన్ని కొని తెచ్చుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

 అల్లు అర్జున్‌ దగ్గర 'గ్యాంగ్‌ లీడర్‌' కథను విక్రమ్ కుమార్ అనేకసార్లు మార్పులు చేసి చెప్పినా ఆకథ   సెకండ్‌ హాఫ్‌ బాగాలేదు అంటూ బన్నీ తిరస్కరించాడు. అయితే ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా నాని విక్రమ్ కుమార్ పై నమ్మకం పెట్టుకుని ‘గ్యాంగ్‌ లీడర్‌’ చేసి మరో ఫ్లాప్ ను కొని తెచ్చుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఆడవాళ్ల తరపున రివెంజ్‌ అంటూ మొదలుపెట్టి విలన్‌ ని కూడా వీక్‌ చేసి విక్రమ్ కుమార్ తీసిన ‘గ్యాంగ్ లీడర్’ నాని అభిమానులకు కూడ నచ్చలేదు. దీనితో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ ను నమ్ముకుని నాని చేసిన మరో ప్రయోగం ఫెయిల్ కావడంతో రానున్న రోజులలో కదల విషయంలో నాని సరైన శ్రద్ధ తీసుకోకపోతే కెరియర్ పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోబోతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయం పై నాని ఎలా ఆలోచిస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: