తెలుగు నాట అత్యధిక ప్రజాదరణ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ మొదటి నుండి ఇప్పటి వరకు ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మొదటి సీజన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. రెండో సీజన్ కి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ దొరక్కపోవడంతో ఆ ఛాన్స్ యువ నటుడు నానికి దక్కింది. అయితే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించే వారికి పారితోషికం చాలా గట్టిగానే ముట్టచెప్పినట్లు సమాచారం.


బిగ్ బాస్ రెండవ సీజన్ ని నాని చాలా చక్కగా వ్యవహరించారు. తనదైన టైమింగ్ తో షోని రక్తి కట్టించాడు. ఇక మూడవ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున చాలా అలవోకగా లాగించేస్తున్నాడని, కూల్ గా సాగిపోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కి వ్యాఖ్యాత గా వ్యవహరించాలని టాలీవుడ్ లోని చాలా మంది సెలెబ్రిటీలను సంప్రదించారట. కానీ ఎక్కువ మంది నో అనే సమాధానం వచ్చిందట, అలా నో చెప్పిన వారిలో మంచు లక్ష్మీ కూడా ఒకరు.


మంచు లక్ష్మీ నిర్మాతగా, నటిగా, టీవీ హోస్ట్ గా అందరికి సుపరిచితురాలు. ముఖ్యంగా ఆమె తెలుగు మాటలకి చాలా మంది అభిమానులు ఉన్నారు.  లక్ష్మీ టాక్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యి, అటు సినిమాల్లో కూడా నటిస్తుంది. బుల్లితెర మీద పలు షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె మేము సైతం, మహారాణి వంటి షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు .తాజాగా ఆమె డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన వూట్ సంస్థ కొరకు ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించనున్నారు.


ఇన్ని షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనుభవం ఉన్నా బిగ్ బాస్ హోస్ట్ గా ఎందుకు చేయలేదు  అని అడుగగా ఆమె ఈ విధంగా స్పందించారు. బిగ్ బాస్ రెండవ సీజన్ హోస్ట్ గా చేసిన నాని ఎంతో చక్కగా షో నిర్వహించినప్పటికీ చాలా మంది ఆయనను విమర్శించడం జరిగింది. అలాంటి విమర్శలు చూసిన నేను, అలాంటి నెగెటివిటీ పేస్ చేయడం నావల్ల కాదని, అందుకే బిగ్ బాస్ హోస్టింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: