సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్100’ మూవీ తీశాడు.  ఈ మూవీ తో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు.  హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ తొలి పరిచయం అయ్యింది.  మొదట ఈ మూవీ ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నా..తర్వాత సూపర్ హిట్ గా నిలిచింది.  గత సంవత్సరం టాప్ కలెక్షన్లు చేసిన మూవీస్ లో ‘ఆర్ఎక్స్100’ ఒకటి.  ఈ మూవీ తర్వాత కార్తికేయ వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో హిప్పి, గుణ 369 లో హీరోగా నటించిన ఆయన నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ మూవీస్ లో కార్తికేయ మంచి పర్ఫామెన్స్ చూపించాడు. తాజాగా కార్తికేయ నటించిన  ’ 90ఎం.ఎల్’ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.  కార్తికేయ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. తాజాగా ఈ టీజర్ లో డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. ‘నా కడుపున దేవదాసు లాంటి కొడుకే పుట్టాలి..కాలిదాసు లాంటి ఓ రైటర్ పుట్టాలని కోరుకో..యేసుదాసు లాంటి ఓ సింగర్ పుట్టాలని కోరుకో..కానీ దేవదాసు లాంటి ఓ డ్రింకర్..’ అని డైలాగ్ ఆకట్టుకుంటుంది.   

ఈ మూవీలో కామెడీ, యాక్షన్ ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ లా కనిపిస్తుంది.  క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 90ఎం.ఎల్’. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. మరో మూడు పాటలను యూరప్ లో చిత్రీకరణ చేయనున్నారు.  ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందన్న ఆశాభావంతో నిర్మాత ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: