ఈ మధ్య బోల్డ్ కంటెంట్ అంటే బూతు కంటెంట్ సినిమాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.అడల్ట్ కంటెంట్ సీన్లు పెట్టి యూత్ ను బాగా అట్రాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు డైరెక్టర్స్.ఇక ఈ సినిమాలకు ప్రేక్షకులు కూడా బాగానే బ్రహ్మరథం పడుతున్నారు.హద్దులు మించిన లిప్ లాక్ కిస్సులు, హగ్గులు, నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.కొత్త భామలనో..బుల్లితెర పై పాపులర్ అయిన భామలనో.. హీరోయిన్లుగా ఎంచుకుంటే వారు అందాల ఆరబోతకు రొమాంటిక్ సీన్లకు చాలా వరకూ అడ్డుచెప్పరు కాబట్టి దర్శక నిర్మాతలకి అదో ప్లస్ పాయింట్.ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని దర్శకనిర్మాతలు ఫాలో అవుతున్నారు.



ఇక నయనతార కూడా ఓ బోల్డ్ కంటెంట్ వున్న సినిమాకు ఓకే చెప్పిందని తెలిసింది.తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్‌ రోల్స్‌తో పాత్రల్లో పేరు తెచ్చుకున్న నయనతార ఆ తర్వాత నుంచి,నటనా ప్రాధాన్య చిత్రాలతోనూ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇక కొంతకాలంగా నాయికా ప్రాధాన్య చిత్రాలతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా తారస్థాయికి చేరింది.సోలో నాయికగా వరుస విజయాలను దక్కించుకుంటూ దక్షిణాదిలోనూ టాప్‌ కథానాయికగా దూసుకెళ్తోంది.ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’,విజయ్‌తో ‘బిగిల్‌’వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.తాజాగా ఈ భామ మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనుందట..



మిలింద్‌ రౌ దర్శకత్వంలో,రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నయన్‌ ప్రియుడు విగ్నేశ్‌ శివన్‌ ‘నెట్రికన్‌’పేరుతో నిర్మిస్తున్న చిత్రంలో నయన నటిస్తుందట.ఇక  ఈ చిత్రంలో సెక్స్,మాఫియా,రొమాన్స్,హింస వంటివి టన్ను టన్నుల్లో ఉండబోతున్నాయట..తాజాగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ను బట్టీ చూస్తుంటే ఇదొక బోల్డ్‌ కథాంశంతో రూపొందబోతున్న చిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నయనతార పాత్ర ఏంటనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఐతే అందాలు ఆరబోస్తుందా,లేక చూపిచూపించనట్లుగా దాచుకుంటు,చూపిస్తుందా అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు ఆగాలట మరి..   


మరింత సమాచారం తెలుసుకోండి: