‘బాహుబలి’ ఇమేజ్ తో నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ అదే మేజిక్ ను రిపీట్ చేద్దామని ‘సాహో’ తో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభాస్ మ్యానియాతో ఈ మూవీని అత్యధిక రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు సుమారు 50 శాతం వరకు నష్టపోయారు అన్న వార్తలు వస్తున్నాయి. 

అయినా ఇలాంటి పరిస్థితులలో కూడ ప్రభాస్ కు 70 కోట్ల లాభం ‘సాహో’ బిజినెస్ ద్వారా వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు గుప్పు మంటున్నాయి. ‘సాహో’ మూవీ నిర్మాతలు ప్రభాస్ కు అత్యంత సన్నిహితులు కావడంతో ఈ మూవీకి ప్రభాస్ పారితోషికం తీసుకోకుండా ఈ మూవీ బిజినెస్ లో షేర్ తీసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. 

ప్రస్తుతం ‘సాహో’ బిజినెస్ అంతా పూర్తి అయిపోయి లెక్కలు చూసుకోవడంతో ‘సాహో’ వల్ల ప్రభాస్ కు అతడి షేర్ కు 70 కోట్ల ఆదాయం వచ్చింది అని వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ విషయాలు నిజంగానే యదార్ధం అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం పొందిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. ‘సాహో’ రికార్డుల పరంగా చరిత్ర సృష్టించకపోయినా ప్రభాస్ పారితోషికం విషయంలో చరిత్ర క్రియేట్ చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘సాహో’ బయ్యర్లు వారి నష్టాలు గురించి ఈ మూవీ నిర్మాతలు అదేవిధంగా ప్రభాస్ ఎంతో కొంత సాయం చేస్తాడు అని ఆశిస్తూ ఉంటే ఇప్పుడు ఇలా ప్రభాస్ పారితోషిక వార్తలు గుప్పు మానడం ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించినా ఖండించక పోయినా ‘సాహో’ తో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్థానానికి గట్టి పునాది వేసుకున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: